ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ :  రూ.7వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే 

  • Published By: sreehari ,Published On : October 28, 2019 / 09:16 AM IST
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ :  రూ.7వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే 

పండుగ సీజన్ వచ్చేసింది. మొబైల్ మార్కెట్లలో చౌకైన ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులు కొత్త ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లలో అధిక ఫీచర్లు ఉండి అతి తక్కువ ధరకే లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లు ఎన్నో ఉన్నాయి. ఖరీదైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కంటే అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. 

షియోమీ, రియల్ మి, ఇన్ఫినిక్స్, లెనొవో వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకే బడ్జెట్ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాయి. కేవలం రూ.7వేలకే కొత్త స్మార్ట్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. బెస్ట్ మొబైల్ ఫోన్ల ధర ఎంత? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓసారి చూద్దాం. 

Redmi 8A : 
షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ Redmi 8A. ఈ ఫోన్ అతి తక్కువ ధరకే ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ పనితీరు కూడా బాగుంటుంది. రూ.7వేలకే లభ్యమయ్యే బెస్ట్ ఫోన్లలో ఈ సిగ్మెంట్ ఫోన్ ఒకటి. ఫీచర్లు విషయానికి వస్తే.. సింగిల్ రియర్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 5000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పనితీరును HD వీడియో లూప్ టెస్టులో పరీక్షించగా.. 16 గంటల 31నిమిషాలు వస్తుందని నిర్ధారించారు. రెడ్ మి 8A ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఒసియన్ బ్లూ కలర్లలో లభ్యం అవుతోంది. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.22 అంగుళాల డిస్ ప్లే 
* 12MP సింగిల్ రియర్ కెమెరా 
* 8MP ఫ్రంట్ కెమెరా 
* 2GB ర్యామ్ + 32GB స్టోరేజీ
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
* 5000mAh బ్యాటరీ సామర్థ్యం
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్

Realme C2 : 
ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లలో రియల్ మి c2 మోడల్ ఒకటి. భారత మార్కెట్లలో స్మా్ర్ట్ ఫోన్ పోర్ట్ ఫోలియోలో వినియోగదారులను ఆకట్టుకుంది. ఈ ఏడాది మే నెలలో రియల్ మి సి2 రిలీజ్ అయింది. రూ.7వేల లోపు లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లలో ఈ సిగ్మెంట్ ఫోన్ ఒకటిగా చెప్పవచ్చు. రియల్ మి సి2 బ్యాటరీ సామర్థ్యం బాగుంది. హెచ్ డీ వీడియో లూప్ టెస్టులో బ్యాటరీ ఛార్జింగ్ 20 గంటల 29నిమిషాల వరకు వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. 13మెగాఫిక్సల్స్ + 2 మెగాఫిక్సల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. రూ.15వేల లోపు బడ్జెట్ అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ ఫోన్ ఒకటి తగిన ధరకే లభిస్తోంది. డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్ కలర్లలో లభ్యం అవుతోంది. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.10 అంగుళాల డిస్ ప్లే
* 13MP + 2MP
* MediaTek Helio P22 ప్రాసెసర్
* 5MP ఫ్రంట్ కెమెరా 
* 2GB ర్యామ్ + 16GB స్టోరేజీ
* 4000mAh బ్యాటరీ సామర్థ్యం
* ఆండ్రాయిడ్ 9.0పై 

Lenovo K9 : 
స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ.7వేల లోపు లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లలో ఏడాది క్రితం రిలీజ్ అయిన లెనొవో K9 బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ ముందుభాగంలో డ్యుయల్ కెమెరా ఫీచర్లతో వచ్చింది. మంచి డిజైన్ తో పాటు క్వాలిటీ పరంగా లెనొవో కె9 ప్రత్యేక ఆకర్షణగా ఉంది. కొన్ని హెవీ యాప్స్ ఇబ్బంది కలిగించేలా ఉన్నప్పటికీ సాధారణ వాడకానికి ఈ ఫోన్ ఎంతో మన్నికగా ఉంటుంది. 3,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 11 గంటల 22 నిమిషాల పాటు నిరంతరయంగా పనిచేస్తుంది. కెమెరా పనితీరు కూడా అంతగా ఆకర్షణీయంగా లేనప్పటికీ ఫొటోలు డల్, వాషడౌట్ కలర్లలో కనిపిస్తాయి. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లలో రూ.7వేల సిగ్మెంట్లో  3GB + 32GB ఒక వేరియంట్ మాత్రం లభ్యం అవుతోంది. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* 5.70 అంగుళాల డిస్ ప్లే
* 13MP + 5MP రియర్ కెమెరా (డ్యుయల్)
* MediaTek MT6762 ప్రాసెసర్
* 13MP + 5MP ఫ్రంట్ కెమెరా
* 3GB RAM + 32GB స్టోరేజీ
* 3000mAh బ్యాటరీ సామర్థ్యం
* ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్