దీపావళి ఆఫర్లు-డిస్కౌంట్లు : కార్ల ధరలపై రూ.4 లక్షలు తగ్గింపు

పండగ సీజన్ వచ్చేసింది. మార్కెట్లో పలు కంపెనీలు సరికొత్త ఆఫర్లు-డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

  • Published By: sreehari ,Published On : October 3, 2019 / 10:22 AM IST
దీపావళి ఆఫర్లు-డిస్కౌంట్లు : కార్ల ధరలపై రూ.4 లక్షలు తగ్గింపు

పండగ సీజన్ వచ్చేసింది. మార్కెట్లో పలు కంపెనీలు సరికొత్త ఆఫర్లు-డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

పండగ సీజన్ వచ్చేసింది. మార్కెట్లో పలు కంపెనీలు సరికొత్త ఆఫర్లు-డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దసరా, దీపావళి పండగల సందర్భంగా ప్రతిఒక్కరూ కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు  ఆరాటపడుతుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆటో మొబైల్ పరిశ్రమలో సేల్స్ పడిపోవడంతో కంపెనీలన్నీ దివాలా తీశాయి. చాలా కంపెనీలు తమ ప్రొడక్షన్ కూడా నిలిపివేశాయి. పండగ సీజన్ రావడంతో ఆటో రంగంలో కొత్త ఆశలు చిగురించాయి. తమ సేల్స్ కు ఇదే సరైన సమయమని భావించే కంపెనీలు తమ ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లను గుప్పిస్తుంటాయి. మార్కెట్లో తక్కువ ధరకే ఆఫర్ చేస్తుంటాయి.

మిగిలిన ఓల్డ్ స్టాక్ క్లీన్ చేసేందుకు పండగ సీజన్ లో ప్లాన్ చేస్తుంటాయి. దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? వెంటనే త్వరపడండి. ఆటో కంపెనీలైన మారుతి సుజుకీ, హుందాయ్, హోండా, టాటా సహా పలు కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కార్ల ధరలను భారీ తగ్గింపుకే ఆఫర్ చేస్తున్నాయి. మారుతి కంపెనీ తమ బ్రాండ్ అయిన సీడాన్ డిజైర్, సబ్ కాంప్టాక్ట్ SUV వితారా బ్రెజా కార్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.

క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫెట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. టయోటా కారు కంపెనీ అయితే లక్షల్లో డిస్కౌంట్లు అఫర్ చేస్తోంది. ఆటో కంపెనీలన్నీ తమ కార్లపై రూ.4లక్షల వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఏ మోడల్ కారు ఎంత ధర ఉంది? డిస్కౌంట్ ధర ఎంత? క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫెట్స్ ఎలా ఆఫర్ చేస్తున్నాయో ఓసారి చూద్దాం. 

మారుతి కార్లపై డిస్కౌంట్లు : 
మారుతీ సుజుకీ డీలర్లు.. కార్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. ఎంట్రీ లెవల్ Alto 800 నుంచి Vitara బ్రెజా కార్ల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నారు. మారుతి ఆల్టో 800 కార్లపై మొత్తం డిస్కౌంట్ ధర రూ.65వేలు (రూ.35వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.25వేలు ఎక్సేంజ్ బోనస్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్) ఆఫర్ చేస్తున్నారు. Alto K10 కారుకు కూడా Alto 800 మాదిరిగానే డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకీ Swift (పెట్రోల్/డీజిల్) కార్లపై రూ.1లక్ష, 05 వేలు (రూ.60వేల క్యాష్ డిస్కౌంట్, రూ.40వేలు ఎక్సేంజ్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్) అందిస్తోంది. 

హుందాయ్ కార్లపై డిస్కౌంట్లు :
హుందాయ్ డీలర్ షిప్.. అన్ని హుందాయ్ రేంజ్ కార్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. కొత్తగా లాంచ్ అయిన Venue, Kona EV, Grand i10 Nios కార్లు మినహాయించి మిగిలిన అన్ని రేంజ్ కార్లపై క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. హుందాయ్ శాంట్రో కారుపై మొత్తం డిస్కౌంట్ ధర రూ.70వేలు కాగా (రూ.35వేలు క్యాష్, రూ.30వేలు ఎక్సేంజ్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్) ఆఫర్ చేస్తోంది.

హుందాయ్ గ్రాండ్ i10 మోడల్ (పెట్రోల్/డీజిల్) కార్ల ధరపై రూ.1 లక్ష,05 వేలతో (రూ.65వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.35వేలు ఎక్సేంజ్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్) డిస్కౌంట్ అందిస్తోంది. హుందాయ్ Elit i20 (పెట్రోల్/డీజిల్) కార్లపై మొత్తం డిస్కౌంట్ ధర రూ.75వేలు ఉండగా (రూ.45వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.25వేలు ఎక్సేంజ్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్) ఆఫర్ చేస్తోంది. 

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు : 
హోండా కార్లపై గరిష్టంగా రూ.4లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హుండా WR-Va కారు మోడల్ పై మొత్తం డిస్కౌంట్ ధర రూ.45వేలు (రూ.25వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.20వేలు ఎక్సేంజ్) ఆఫర్ చేస్తోంది. హోండా సిటీ కార్లపై ధర రూ.65వేలు డిస్కౌంట్ (రూ.35వేలు క్యాష్, రూ.30వేలు ఎక్సేంజ్) అందిస్తోంది. హోండా జాజ్ కార్లపై రూ.50వేలు వరకు డిస్కౌంట్ (రూ.35వేలు క్యాష్, రూ.50వేలు ఎక్సేంజ్, రూ.30వేలు డిస్కౌంట్) ఆఫర్ చేస్తోంది. 

టయోటా కార్లపై డిస్కౌంట్లు :
టయోటా ఎటియోస్ కార్ల ధరలపై ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ రూ.10వేల వరకు ఆఫర్ చేస్తోంది. టయోటా ఇన్నోవా క్రిస్టా కార్లపై మొత్తం డిస్కౌంట్ ధర రూ.55వేలు నిర్ణయించగా (రూ.25వేలు క్యాష్, రూ.30వేలు ఎక్సేంజ్)అందిస్తోంది. అలాగే టయోటా యారిస్ కార్లపై రూ.1.15 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. టయోటా గ్లాంజా కార్లపై రూ.30వేలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో (రూ.10వేలు క్యాష్, రూ.15వేలు ఎక్సేంజ్, రూ.5వేలు కార్పొరేట్) ఆఫర్ చేస్తోంది. టయోటా ఫర్టునర్ కార్లపై బిగ్ డిస్కౌంట్ రూ.1.2 లక్షల వరకు అఫర్ చేస్తోంది. ఎక్సేంజ్ బోనస్ కింద రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తుండగా.. కార్పొరేట్ బెనిఫెట్ డిస్కౌంట్ ధర రూ.20వేలు వరకు అఫర్ చేస్తోంది. 

టాటా మోటార్స్ కార్లపై డిస్కౌంట్లు :
టాటా మోటార్స్ డీలర్ షిప్.. ప్రస్తుతం టయాగో, టైగర్, నెక్సాన్, హెక్సా రేంజ్ కార్లపై క్యాష్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. టయాగో కార్లపై మొత్తం డిస్కౌంట్ ధర రూ.35వేలు (రూ.20వేలు క్యాష్, రూ.10వేలు ఎక్సేంజ్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్) ఆఫర్ చేస్తోంది.

టైగర్ కార్లపై రూ.65వేలు క్యాష్ డిస్కౌంట్ (రూ.20వేలు క్యాష్, రూ.25వేలు ఎక్సేంజ్, రూ.7వేలు కార్పొరేట్ డిస్కౌంట్) ఆఫర్ అందిస్తోంది. టాటా నెక్సాన్ కార్లపై ధర రూ.72వేలు తగ్గించగా (రూ.40వేలు క్యాస్, రూ.25వేలు ఎక్సేంజ్, రూ.7వేలు కార్పొరేట్) ఆఫర్ చేస్తోంది. టాటా హెక్సా మొత్తం డిస్కౌంట్ ధర రూ.1.45 లక్షలు కాగా.. కొత్త 2019 హెక్సా కార్లపై డిస్కౌంట్ రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.