All In One : జియో ‘సూపర్ యాప్’ వచ్చేస్తోంది

ప్రముఖ మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో.. మరో సరికొత్త సంచలనానికి ప్లాన్ బిగ్ గేమ్ ప్లాన్ రెడీ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : May 2, 2019 / 09:37 AM IST
All In One : జియో ‘సూపర్ యాప్’ వచ్చేస్తోంది

ప్రముఖ మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో.. మరో సరికొత్త సంచలనానికి ప్లాన్ బిగ్ గేమ్ ప్లాన్ రెడీ చేస్తోంది.

ప్రముఖ మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో.. మరో సరికొత్త సంచలనానికి రెడీ అవుతోంది. ప్రపంచ అతిపెద్ద ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాంగా సూపర్ యాప్ సర్వీసును లాంచ్ చేసేందుకు సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ బిగ్ గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. టెలికం ఇండస్ట్ర్రీలోకి అడుగుపెట్టిన కొన్ని ఏళ్లలోనే జియో ఇతర టెలికం పోటీదారులను షేక్ చేసింది. చౌకైన ధరకే అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లు అందిస్తూ యూజర్లను జియో తనవైపు తిప్పుకుంది. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది యూజర్లతో అతిపెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ముఖేష్ అంబానీ సొంత కంపెనీ రిలయన్స్ జియో ఈ కామర్స్ సెక్టార్ లోకి త్వరలో అడుగుపెట్టనుంది. జియో ఆరంగేట్రంతో ప్రపంచ ఈ-కామర్స్ షాపింగ్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైతం షేక్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన పేటీఎం, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి డిజిటల్ సంస్థలు సత్తా చాటలేక చేతులేత్తేశాయి.

ఒకే యాప్ పై .. 100 సర్వీసులు :
ఈ-కామర్స్ రంగంలో పాతుకుపోయిన ఎకో సిస్టమ్ షాపింగ్ యాప్ లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు సవాల్ గా జియో సరికొత్త యాప్ వచ్చేస్తోంది. అదే.. జియో (Super App) సూపర్ యాప్. ప్రస్తుతం ఈ సూపర్ యాప్ వర్కింగ్ స్టేజీలో ఉందని, త్వరలోనే ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసి యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ సూపర్ యాప్ సర్వీసు ద్వారా జియో ఒకేచోట.. 100 సర్వీసులను అందించనుంది. కోట్లాది యూజర్లు ఉన్న జియో.. ఈ కొత్త యాప్ సర్వీసు ద్వారా దేశవ్యాప్తంగా యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు సహకరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆన్ లైన్ లో ఈ కామర్స్ మార్కెట్ ను సెట్ చేసుకున్నాక.. ఆఫ్ లైన్ మార్కెట్ లోకి అడుగుపెట్టేందుకు జియో మరో ప్లాన్ చేయనున్నట్టు ఇండస్ట్రీ ఇంటిలిజెన్స్ గ్రూప్ (IIG)అధ్యక్షుడు ప్రభు రామ్ తెలిపారు. సూపర్ యాప్ సర్వీసు ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ సర్వీసును యూజర్లకు అందించేందుకు జియో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 

ఇండియాలో WeChat యాప్ :
ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (AI), ఎఐ బేసిడ్ ఎడ్యుకేషనల్ లేయర్, వాయిస్ టెక్ లేయర్, లాజిస్టిక్స్ లేయర్.. ఇవన్నీ కలిసి ఒకే ప్లాట్ ఫాంపై సర్వీసు అందించేలా ఇండియాలో WeChat యాప్ (సూపర్ యాప్)ను  క్రియేట్ చేయనున్నట్టు రామ్ తెలిపారు. ఇండియాలో వాల్ మార్ట్ భాగస్వామ్య ఈ కామర్స్ పోటీదారులైన ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్ సహా ఇతరులకు ధీటుగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త ప్లాన్స్ రెడీ చేస్తున్నట్టు రామ్ తెలిపారు.

దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా మార్చెంట్స్ కు చేరువలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేదికలుగా ఈ కామర్స్ ప్లాట్ ఫాం సర్వీసును అందించాలనే లక్ష్యంతో ముఖేష్ అంబానీ రెడీ అవుతున్నట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు ఇండియాలో భారీ స్థాయిలో రిలయన్స్ జియో.. లాంచ్ చేసిన గిగాఫైబర్ FTTH సర్వీసుతో బ్రాడ్ బ్యాండ్, ల్యాండ్ లైన్ కనెక్టవిటీని టీవీ ఛానెళ్లను యూజర్లకు అందించనుంది. 

ఆన్ లైన్ బస్ టికెట్లు, పేమెంట్స్ ఇక ఈజీ : 
జియో అందించే సూపర్ యాప్ సర్వీసు ద్వారా ఆన్ లైన్ లో బస్ టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఆన్ లైన్ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్ ఫాంల నుంచి షాపింగ్ చేయొచ్చు.. నచ్చిన వస్తువులను సెలెక్ట్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. జియో సూపర్ యాప్ యూజర్లు తమ ప్రొడక్టులను కూడా ఈ ప్లాట్ ఫాంపై ఈజీగా సేల్ చేసుకోవచ్చు కూడా. అవసరమైతే కావాల్సిన ష్యాషన్ డ్రెసెస్, షూ, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు.