Stock Market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. 874 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి, 59,331 వద్ద ముగిసింది. అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి.

Stock Market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. 874 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి, 59,331 వద్ద ముగిసింది.

India Women U19: ప్రపంచ కప్‌కు చేరువలో భారత్.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి టీమిండియా

అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. చివరగా అక్టోబర్ 21, 2022న సెన్సెక్స్ భారీగా నష్టపోయి 59,307 వద్ద ముగిసింది. ఈ రోజు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 288 పాయింట్లు నష్టపోయి, 17,604 వద్ద ముగిసింది. ప్రధానంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. అయితే, టాటా మోటార్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ వంటివి మాత్రం మంచి లాభాలనే చవిచూశాయి. శుక్రవారానికి ముందు సెషన్లో కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్ని చవిచూశాయి. మొత్తంగా రెండు రోజుల్లో మార్కెట్లో కోల్పోయిన సంపద విలువ రూ.10.65 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

Telangana Jobs: తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్.. 2391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

అదానీ సంస్థల గురించి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక వల్ల ఆ సంస్థ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. దీని ప్రభావం బ్యాంకింగ్ షేర్లపై పడింది. ఆసియాకు సంబంధించి ఇండియా షేర్లు భారీ నష్టాల్ని చవిచూస్తే సియోల్, టోక్యో, హాంకాంగ్ షేర్లు మాత్రం లాభాలతో ముగిశాయి. యూరప్, అమెరికా మార్కెట్లు కూడా సానుకూలంగానే ముగిశాయి. రిపబ్లిక్ డే కారణంగా మన దేశంలో గురువారం స్టాక్ మార్కెట్లు పని చేయలేదు. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 1.35 శాతం పెరిగి, 88.65 డాలర్ల వద్ద ముగిసింది.