BMW నుంచి కొత్త X5 SUV కారు.. ధర ఎంతంటే?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. కొత్త జనరేషన్ X5 SUV కారును BMW కంపెనీ గురువారం (మే 16, 2019) ఇండియాలో లాంచ్ చేసింది.

  • Published By: sreehari ,Published On : May 16, 2019 / 01:30 PM IST
BMW నుంచి కొత్త X5 SUV కారు.. ధర ఎంతంటే?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. కొత్త జనరేషన్ X5 SUV కారును BMW కంపెనీ గురువారం (మే 16, 2019) ఇండియాలో లాంచ్ చేసింది.

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. కొత్త జనరేషన్ X5 SUV కారును BMW కంపెనీ గురువారం (మే 16, 2019) ఇండియాలో లాంచ్ చేసింది. ఎస్ యూవీ మోడల్ డీజిల్ వేరియంట్ల కార్లలో ఇదే లేటెస్ట్ వెర్షన్ కూడా. ఇంతకీ ఇండియన్ మార్కెట్ లో ఈ మోడల్ ప్రారంభ ధర ఎంతో తెలుసా? రూ.72.9 లక్షలు.

బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా అధ్యక్షులు హన్స్ క్రిస్టేయన్ బార్టెల్స్, లెజండరీ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ కలిసి ఈ కొత్త ఎక్స్ 5 ఎస్ యూవీ కారును లాంచ్ చేశారు. దేశీయ మార్కెట్ లో ఎక్కువ మోడల్స్ సేల్స్ అయ్యే కార్ల తయారీ కంపెనీల్లో BMW X5 ఒక మోడల్ ఒకటి.

ఎస్ యూవీ కార్లలో లేటెస్ట్ వెర్షన్ తో పూర్తిగా మెర్సిడెస్-బెంజ్ GLE, Volvo XC9, రేంజ్ రోవర్ వెలార్, పొర్ష్కె కెయిన్నె, ఆడిQ7 సిగ్మంట్లతో వస్తోంది. 1999లో బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కు సిగ్మంట్లతో కూడిన స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (SAV)ను కంపెనీ డిజైన్ చేసింది. అప్పటినుంచి ఎన్నోఏళ్లుగా BMW X5 బెస్ట్ సెల్లింగ్ కారు మోడల్ సిగ్మంట్ గా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

గత ఏడాది క్యాలెండర్ ఈయర్ ప్రకారం.. ఇండియాలో 11వేల 105 యూనిట్లతో బీఎండబ్ల్యూ 13 శాతానికి పైగా కార్లను అమ్మేసింది. 2017 క్యాలెండర్ ఈయర్ లో 9వేల 8వందల యూనిట్లు అమ్మింది. 2019 ఏడాదిలో మార్చి త్రైమాసికంలో 2వేల 982 యూనిట్లతో ఫస్ట్ క్వార్టర్ సేల్స్ అత్యధికంగా నమోదైనట్టు గ్రూపు నివేదికలో తెలిపింది.