EV Fast-Charging Corridors : ఆ 3 నగరాల హైవేల్లో 19 ఈవీ ఫాస్ట్-ఛార్జింగ్ కారిడార్స్.. ప్రతి 100కి.మీకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్!

EV Fast-Charging Corridors : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేలపై 19 EV ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది.

EV Fast-Charging Corridors : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేలపై 19 EV ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఒక్కో కారిడార్‌లలో దాదాపు ప్రతి 100 కి.మీకి ఒక EV ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు BPCL ఉన్నతాధికారి వెల్లడించారు.

బీపీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్) పీఎస్ రవి మాట్లాడుతూ.. వివిధ విద్యుత్ కారిడార్లుగా విభజించి 110 ఫ్యూయల్ స్టేషన్ల మధ్య ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేరళలో 19 ఇంధన కేంద్రాలతో మూడు కారిడార్లు, కర్ణాటకలో 33 ఇంధన కేంద్రాలతో 6 కారిడార్లు, తమిళనాడులో 58 ఇంధన కేంద్రాలతో 10 కారిడార్‌లను ప్రారంభించినట్లు తెలిపారు.

BPCL ఇంధన స్టేషన్ల వద్ద 125 కి.మీల వరకు డ్రైవింగ్ పరిధిలో ఒక్కో EVని ఛార్జ్ చేసేందుకు కేవలం 30 నిమిషాలు పడుతుంది. రెండు ఛార్జింగ్ స్టేషన్ల మధ్య 100 కి.మీల దూరం ఉంటుందని దక్షిణాది రిటైల్ హెడ్ పుష్ప్ కుమార్ నాయర్ చెప్పారు. ఫాస్ట్ ఛార్జర్లు వినియోగానికి చాలా ఈజీగా ఉంటాయని తెలిపారు. అవసరమైతే సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు.

BPCL Installs 19 EV Fast-Charging Corridors Along Highways in Karnataka, Kerala and Tamil Nadu

Read Also : Windows New Update : విండోస్‌లో కొత్త అప్‌డేట్.. స్ర్కీన్‌షాట్ ఎడిటింగ్‌లో బగ్.. ఫిక్స్ చేసిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

ఎలాంటి మాన్యువల్ సాయం లేకుండా ఆటో-ఆపరేషన్ చేయవచ్చని రవి చెప్పారు. BPCL ఆన్‌లైన్ అవాంతరాలు లేని పారదర్శక కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు HelloBPCL యాప్ ద్వారా మొత్తం EV ఛార్జర్ లొకేటర్, ఛార్జర్ కార్యకలాపాలు, లావాదేవీల ప్రక్రియను డిజిటలైజ్ చేసినట్టు రవి పేర్కొన్నారు.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్, కేరళలోని గురువాయూర్, కడంపుజ దేవాలయాలు, కొచ్చిలోని వల్లార్‌పదం జాతీయ పుణ్యక్షేత్రమైన కొచ్చి, కొరట్టి, త్రిసూర్‌లోని మర్కజ్ నాలెడ్జ్ సిటీ వంటి ముఖ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో, పర్యాటక ప్రాంతాలను నగరాలతో అనుసంధానించే EV కారిడార్‌లను మదురైలోని కన్యాకుమారి, మీనాక్షి అమ్మన్ దేవాలయంలో కంపెనీ ప్రారంభించింది.

భారత్ పెట్రోలియం రెండవ అతిపెద్ద భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీ.. భారత్‌లో ప్రీమియర్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీలలో ఒకటిగా ఉంది. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో 20వేలకు పైగా ఎనర్జీ స్టేషన్‌లు, 6,200పైగా LPG డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లు, 733 లూబ్రికెంట్ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లు, 123 POL (పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్) స్టోరేజ్ లొకేషన్‌లు, 54 LPG బాట్లింగ్ ప్లాంట్లు, 60 క్రాస్ లుబ్రికెంట్ సర్వీస్ స్టేషన్‌లు, 4 ఎవియేషన్ ప్లాంట్లు-4 ఎండింగ్ ఉన్నాయి.

Read Also : Hyundai Ai3 Micro SUV : భారత్‌లో హ్యుందాయ్ Ai3 మైక్రో SUV టెస్టింగ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు