WhatsApp నుంచి Gas బుకింగ్

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 06:40 AM IST
WhatsApp నుంచి Gas బుకింగ్

సిలిండర్ బుక్ చేయడానికి ఎక్కువగా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లో జస్ట్ WhatsApp ఉంటే సరిపోతుంది. సింపుల్ గా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా వంట గ్యాస్ బుక్ చేసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లడం, ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకొంటుంటాం. ఇక నుంచి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయం కల్పించారు. 

భారత దేశంలోనే రెండో అతిపెద్ద ఇంధన కంపెనీ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) గుడ్ న్యూస్ వినిపించింది. WhatsApp నుంచి వంట గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించింది. కంపెనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ నెంబర్ ‘1800 224 344’ ద్వారా తమ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

కస్టమర్లకు సులభంగా సేవలందించేందుకు ఈ సదుపాయం కల్పించామని కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ అరుణ్ సింగ్ వెల్లడించారు. డెబిట్ లేదా, క్రెడిట్ కార్డులు, UPI, అమెజాన్ ద్వారా చెల్లింపులు జరుపుకొనే అవకాశం కల్పించామన్నారు. సిలిండర్ బుక్ చేసుకున్న అనంతరం ఆన్ లైన్ పేమెంట్ కోసం లింక్ తో పాటు కన్ఫర్ మేషన్ వస్తుంది. బీపీసీఎల్ కు దాదాపు 71 మిలియన్లు (7.1 కోట్లు) మంది కస్టమర్లు ఉన్నారు. 2020, మే 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే IVRS, Missed Call, Apps, Website, తదితర డిజిటల్ ఛానల్స్ ద్వారా ఎల్పీజీ బుక్ చేసుకొనే సౌకర్యం ఉందన్నారు. 

Read: COVID-19 కారణంగా TikTokకు భారీ నష్టం, యాంటీ చైనా భావాలే కొంపముంచాయా?