BSNL షాకింగ్ : 54 వేల మంది ఉద్యోగుల తొలగింపు ?

  • Published By: madhu ,Published On : April 3, 2019 / 03:28 PM IST
BSNL షాకింగ్ : 54 వేల మంది ఉద్యోగుల తొలగింపు ?

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన బీఎస్ఎన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో షాక్ తగులబోతోందా ? ఎంప్లాయిస్‌లను తీసివేస్తారా ? అనే ప్రచారం జరుగుతోంది. సుమారు 54వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రతిపాదన తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే BSNL జరిగిన బోర్డు కీలక ప్రతిపాదనలకు ఒకే చెప్పినట్లు సమాచారం. ఇందులో రిటైర్మెంట్ వయస్సు కుదింపు, బలవంతం VRS, 4జీ స్ప్రెక్ట్రం కేటాయింపు తదితర వాటిపై నిర్ణయాలు తీసుకుందని టాక్. 

బీఎస్ఎన్ఎల్…ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్…తీవ్ర నష్టాలతో ఇది కుదేలై పోయింది. టెలికాం రంగంలో ముకేశ్ అంబానీ ‘జియో’ ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుండి బీఎస్ఎన్ఎల్‌కు కష్టాలు ఎదురయ్యాయి. చివరకు పరిస్థితి ఎంతలా దారి తీసిదంటే…ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడమే కష్టమై అయిపోయింది. వీరికి జీతాలు ఇవ్వడానికి అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 

ప్రస్తుతం ఎన్నికల కాలం నడుస్తోంది. ఇది అయిపోగానే వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. 54 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని ఇటీవలే జరిగిన బీఎస్ఎన్ఎల్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పదవీ విరమణ వయస్సు 60 నుండి 58 సంవత్సరాలకు తగ్గించాలని..50 సంవత్సరాలకు పైబడిన ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించాలని..4జీ స్పెక్ట్రం కేటాయించాలని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టెలికాం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.