రూ.888లకే ఆఫర్ : JioFiberకు పోటీగా BSNL ట్రిపుల్ పే ప్లాన్ 

టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా వార్ మొదలైంది. చీపెస్ట్ మొబైల్ డేటా, కాలింగ్ ప్లాన్ ఆఫర్లపై టెలికం కంపెనీల్లో గట్టి పోటీ నెలకొంది.

  • Published By: sreehari ,Published On : November 4, 2019 / 11:11 AM IST
రూ.888లకే ఆఫర్ : JioFiberకు పోటీగా BSNL ట్రిపుల్ పే ప్లాన్ 

టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా వార్ మొదలైంది. చీపెస్ట్ మొబైల్ డేటా, కాలింగ్ ప్లాన్ ఆఫర్లపై టెలికం కంపెనీల్లో గట్టి పోటీ నెలకొంది.

టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా వార్ మొదలైంది. చీపెస్ట్ మొబైల్ డేటా, కాలింగ్ ప్లాన్ ఆఫర్లపై టెలికం కంపెనీల్లో గట్టి పోటీ నెలకొంది. మొబైల్ డేటా ప్లాన్ల నుంచి బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల వరకు వచ్చింది. ప్రభుత్వ టెలికం ఆపరేటర్లు కూడా జియోతో పోటీగా కొత్త ఆఫర్లతో యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లలో ఆకర్షణీయమైన వాయిస్ కాల్స్, డేటా ప్లాన్లతో అదరగొడుతున్న BSNL.. తమ BroadBand Plans యూజర్ల కోసం ప్రత్యేకించి Triple Pay ప్లాన్లను ఆఫర్ చేసింది. 

ఇందులో TV సర్వీసు ప్రొవైడర్ శ్రీదేవి టెలివిజన్ (SDV) భాగస్వామ్యంతో ప్రారంభ ధర రూ.888లకే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది. అయితే.. కేబుల్ టీవీ ప్లాన్ కావాలంటే సపరేటుగా ప్రారంభ ధర రూ.243తో సర్వీసు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భాగస్వామ్యం కింద BSNL మొత్తం 10 ప్లాన్లను లాంచ్ చేసింది. SDV ఆపరేటర్ ఆఫర్ చేసే కేబుల్ టీవీ ప్లాన్లలో మొత్తం 10 ప్లాన్ల నుంచి ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్లు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

ట్రిపుల్ పే ప్లాన్ల కింద మిగిలిన మూడు ప్లాన్లతో కలిపి BSNL అన్ని భారత్ పైబర్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో ఫైబ్రో కోంబో ULD 645 CS95, ఫైబ్రో కోంబో ULD CS 96, Fibro Combo ULD 2795 CS20 వీటిన్నింటిపై రూ.849, రూ.1,227, రూ.2,499, రూ.4,499, రూ.5,999, రూ.9,999, రూ.16,999 ఇలా మొత్తం 10 ప్లాన్లను ట్రిపుల్ పే ప్లాన్ కింద BSNL ఆఫర్ చేస్తోంది. 

ట్రిపుల్ పే ప్లాన్ ఎలా పనిచేస్తుందంటే :
* కేబుల్ టీవీ ఆపరేటర్ నుంచి బ్రాడ్ బ్యాండ్ యూజర్లు రూ.333 ప్యాక్ నుంచి రూ.1277 వరకు ఎంచుకోవచ్చు.
* ఒకవేళ యూజర్లు రెండు కావాలనుకుంటే రూ.1,277 ప్లస్ రూ.333లు చెల్లించాలి.
* అంటే నెలవారీ చెల్లించాల్సిన బిల్లు GSTతో కలిపి మొత్తం రూ.1610 చెల్లించాలి.
* ఈ అమౌంట్ పై అదనంగా GST (18%) చెల్లించాల్సి ఉంటుంది.

BSNL Ad-ons ప్లాన్లు ఇవే :
* ట్రిపుల్ పే ప్లాన్లపై BSNL బ్రాడ్ బ్యాండ్ యాడ్ ఆన్స్ ప్లాన్లు అఫర్ చేస్తోంది.
* డేటాపై టాప్ ఆఫ్ డేటా కోసం add-ons ఆఫర్ అదనంగా అందిస్తంది.
* యాడ్ ఆన్ ప్లాన్లు రూ.100 (2GB డేటా), రూ.200 (5GB డేటా), రూ.300 (10GB డేటా), రూ.500 (20GB డేటా)