బడ్జెట్ 2019 హైలెట్స్: రైల్వేలకు రూ.64వేల 587కోట్లు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019-20లో రైల్వే రంగానికి కూడా భారీ కేటాయింపులు ప్రకటించింది. ఇప్పటికే పలు రంగాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. భారతీయ రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉన్నట్టు తెలిపింది.

  • Published By: sreehari ,Published On : February 1, 2019 / 07:35 AM IST
బడ్జెట్ 2019 హైలెట్స్: రైల్వేలకు రూ.64వేల 587కోట్లు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019-20లో రైల్వే రంగానికి కూడా భారీ కేటాయింపులు ప్రకటించింది. ఇప్పటికే పలు రంగాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. భారతీయ రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉన్నట్టు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019-20లో రైల్వే రంగానికి కూడా భారీ కేటాయింపులు ప్రకటించింది. ఇప్పటికే పలు రంగాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. భారతీయ రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉన్నట్టు తెలిపింది. రైల్వే రంగానికి బడ్జెటరీ సపోర్టు కింద రూ. 64 వేల 587 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది అని గోయల్ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం పాలనలో ఇదొక బిగ్ అచీవ్ మెంట్ గా గోయల్ తెలిపారు. 

2018-19 కేంద్ర బడ్జెట్ లో రైల్వే రంగానికి క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ కింద రూ.1.46 లక్షల కోట్లు ప్రకటించగా.. 2019-20 మధ్యంతర బడ్జెట్ లో కేంద్రం.. క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ కింద రూ.1.58 లక్షల కోట్లు ప్రకటించింది. 2018-19 బడ్జెట్ లో రైల్వే రంగానికి 55వేల 088 కోట్లు కేటాయించగా.. 2017-18 బడ్జెట్ కేటాయింపులో రూ.41వేల 813.8 కోట్లు, 2016-17 ఏడాది బడ్జెట్ లో రూ.45వేల 231.63 కోట్లు కేటాయించింది. 92ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ ను వేర్వేరుగా ప్రకటించడాన్ని 2016 సెప్టెంబర్ లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేంద్ర బడ్జెట్ తో కలిపి రైల్వే బడ్జెట్ ను ప్రకటించడం ఇది మూడోసారి. 

బడ్జెట్ 2019-20 హైలెట్స్.. 

* బ్రాడ్‌గేజ్‌లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించాం.
* అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రానుంది
* రైల్వే ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సౌకర్యం, కొత్త ఉద్యోగాల కల్పన 
* స్పీడ్ ట్రైన్స్, భద్రతో కూడిన సర్వీసులు
* మిజోరాం, మేఘాలయా రాష్ర్టాలను రైల్వేతో అనుసంధానం చేశాం
* దేశీయ అత్యాధునిక ట్రైన్ 18తో కలిపి కొత్త ట్రైన్లు
* రైల్వే స్టేషన్ల దగ్గర వైఫై కనెక్షన్లు 
* రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు