కిక్కిచ్చే వార్త : ఆన్‌‌లైన్‌లో బీర్, విస్కీ

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 10:34 AM IST
కిక్కిచ్చే వార్త : ఆన్‌‌లైన్‌లో బీర్, విస్కీ

మందుబాబులకు కిక్కిచ్చే వార్త. అబ్బా అంత దూరం పోవాలా..మందు కొనుక్కోవడానికి..అక్కడకు వెళ్లాలి..రష్‌లో నిలబడాలి..దీని బదులు మంచిగా ఆన్ లైన్‌లో సిస్టం పెడితే అయిపోతుండే కదా. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్‌లో వచ్చేశాయి..దీనిని కూడా చేర్చిస్తే..ఏమవుతుంది..అని మందుబాబుల్లో కొంతమంది అనుకుంటుంటారు. కానీ త్వరలోనే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మీకు ఇష్టమైన ఆల్కాహాల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఒక సిస్టం రూపొందుతోంది. ఈ కామర్స్ విభాగంపై కన్నేసింది. ఆన్ లైన్ అమ్మకాలు ఊహించిన దానికన్నా ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ (ISWAI) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అమృత్ కిరణ్ సింగ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాస్తవానికి కర్నాటక రాష్ట్రం దీనిని అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. కానీ చిల్లర సమస్య పరిష్కరించలేదన్నారు. ఇదే జరిగితే..ఇక మందుబాబులు ఆన్‌లైన్‌‌లోనే నచ్చిన బ్రాండ్‌ను ఆర్డర్ ఇచ్చుకోవచ్చన్నమాట. 

ఎన్నో రాష్ట్రాల ఖజానాకు ఎక్సైజ్ శాఖ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. రాష్ట్రాలు మరింత ఆదాయం పెంచుకోవడానికి ఇది సరైన సమయం అనిపిస్తోందని కిరణ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జీఎస్టీని మినహాయిస్తే..రాష్ట్రాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా చెప్పుకొచ్చారు. ఈ రిటైలింగ్ వల్ల ప్రతి రంగంలోనూ పెరుగుదల కనిపిస్తోందని, దీనిని లిక్కర్ పరిశ్రమకు కూడా వర్తింపచేయవచ్చన్నారు.

లిక్కర్ పరిశ్రమ నుంచి ఆదాయం కోరుకుంటున్నాయని, కానీ..బాధ్యతాయుతంగా ఉండే చట్టాలను మాత్రం తీసుకరాలేకపోతున్నాయన్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే..25 ఏళ్ల వయస్సు ఉండాలనే నిబంధన ఉందని, కానీ..దీనికి 21 ఏళ్లు సరిపోతాయని వెల్లడించారు. ఆల్కాహాల్‌ను ఎవరైనా ప్రోత్సాహిస్తే..మాత్రం ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయని, ఇందులో రాజకీయ లబ్దే ఉంటుందన్నారు.