బంగారం కొంటున్నారా: 3 బ్యాంకుల్లో భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు 

  • Published By: sreehari ,Published On : October 25, 2019 / 08:32 AM IST
బంగారం కొంటున్నారా: 3 బ్యాంకుల్లో భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు 

పసిడి పండగ.. ధన త్రయోదశి వచ్చేసింది. బంగారం కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పండగ ఆఫర్లలో బంగారం సొంతం చేసుకోవడానికి తొందరపడుతుంటారు. ధన త్రయోదశి, దీపావళి పండగ పర్వదినాల్లో బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. బంగారం కొనేవారికి బంఫర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పీసీ జ్యుయలరీ, తనీష్క్, సెన్కో గోల్డ్ వంటి జ్యుయెలరీ సంస్థలు వినియోగదారులకు బంగారం కొనుగోలుపై ఆఫర్లు గుప్పిస్తున్నాయి. 

దీపావళి, దంతే రష్ పురస్కరించుకుని ప్రత్యేకించి కొన్ని బ్యాంకులు తమ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్ డిఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకులు బంగారం కొనే కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. తమ బ్యాంకు బ్రాంచుల్లో వినియోగదారులు ఎవరైతే క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా బంగారం కొనుగోలు చేస్తారో వారికి భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. బంగారం కొనుగోలుపై ఏ బ్యాంకులు ఎంత డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయో ఓసారి చూద్దాం. 

ICICI బ్యాంకు.. గోల్డ్ ఆఫర్లు : 
డిజిటల్ గోల్డ్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంకు గోల్డ్ ఆఫర్ అందిస్తోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.వెయ్యి విలువైన బంగారం లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 25, 2019 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సేఫ్ గోల్డ్ బ్యాలెన్స్ ఆఫర్ కింద గోల్డ్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. దీనిపై 30మిల్లీగ్రాముల బంగారాన్ని ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ చివరితేదీకి 14 రోజుల్లోగా కస్టమర్ అకౌంట్ కు బంగారాన్ని తిరిగి పంపిస్తుంది. డిజిటల్ గోల్డ్ కింద.. తొలి ట్రాన్సాక్షన్ చేసిన 5వేల కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాయిన్స్, బార్స్ వంటి బంగారాన్ని గోల్డ్ బ్యాలెన్స్ కింద ఇంటికి డెలివరీ చేయమని కూడా కస్టమర్లు కోరవచ్చు. దీనికి డెలివరీ ఛార్జీ కింద రూ.99 చెల్లిస్తే చాలు. గోల్డ్ బ్యాక్ ఆఫర్ అక్టోబర్ 20, 2019 నుంచి అక్టోబర్ 25, 2019 వరకు అందుబాటులో ఉంటుంది. ఒక రోజులో తొలి 200 డెలివరీలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

ICICI బ్యాంకు – TBZ ఆఫర్లు : 
* ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుపై TBZ కంపెనీ నుంచి కనిష్టంగా రూ.50వేల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 5శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. 
* ఒక్కో క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. 
* బ్యాంకు క్రెడిట్ కార్డుతో EMI లావాదేవీలు చేస్తే ఈ ఆఫర్ వర్తించదు. 
* ఈ ఆఫర్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29, 2019 వరకు అందుబాటులో ఉంటుంది.
* జనవరి 30, 2020 నాటికి క్యాష్ బ్యాక్ అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. 

HDFC Bank :Tanishq ఆఫర్లు :
HDFC బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా తనీష్క్ స్టోర్ల నుంచి బంగారం కొనుగోలు చేస్తున్నారా? సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29, 2019 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 
* రూ.50వేల నుంచి రూ.99వేల మధ్య కొనుగోలు చేస్తే.. రూ.2వేల 500 డిస్కౌంట్లు 
* రూ.లక్ష నుంచి రూ.2లక్షల 49వేల 999 కొంటే.. రూ.5వేల వరకు డిస్కౌంట్
* రూ.2లక్షల 50వేల విలువైన బంగారం కొంటే.. రూ.10వేల వరకు డిస్కౌంట్ 

HDFC – రిలయన్స్ Jewels ఆఫర్ : 
HDFC బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా రిలయన్స్ జ్యుయెల్స్ స్టోర్ల నుంచి బంగారం కొంటున్నారా? 
* రూ.10వేల వరకు కనిష్టంగా 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
* ఈ ఆఫర్ కింద గరిష్టంగా రూ.2వేల 500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
* సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
* ఇతర స్టోర్లలో రూ.20వేలకు పైగా బంగారం కొంటే.. రూ.వెయ్యి వరకు క్యాష్ బ్యాక్ 
* ఈ ఆఫర్ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 26వరకు ఉంటుంది. 

SBI Card-Senco ఆఫర్ :
* ఒక గ్రాము బంగారం కొనుగోలుపై రూ.100 వరకు తగ్గింపు 
* డైమండ్ జ్యుయెలరీ పై 20శాతం వరకు తగ్గింపు 
* జెమ్ స్టోన్లపై 10 శాతం వరకు తగ్గింపు

SBI Card-ORRA ఆఫర్ : 
* డైమండ్ గోల్డ్ కొనుగోలుపై ఫ్లాట్ 10శాతం తగ్గింపు
* రూ.1.5లక్షలు ఆపై విలువైన ప్లాటినం బంగారంపై 10శాతం తగ్గింపు 

SBI Card : KIAH జ్యుయెలరీ ఆఫర్ :
* డైమండ్ జ్యుయెలరీ కొనుగోలుపై ఫ్లాట్ 25శాతం వరకు తగ్గింపు