DTHను ముంచనున్న జియో : సర్వీసులు చూసి కస్టమర్లు షాక్

జియో గిగా ఫైబర్. జియో నుంచి రాబోతున్న మరో సంచలనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఆగస్టు 12న జియో గిగా ఫైబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 05:41 AM IST
DTHను ముంచనున్న జియో : సర్వీసులు చూసి కస్టమర్లు షాక్

జియో గిగా ఫైబర్. జియో నుంచి రాబోతున్న మరో సంచలనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఆగస్టు 12న జియో గిగా ఫైబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్

జియో గిగా ఫైబర్. జియో నుంచి రాబోతున్న మరో సంచలనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఆగస్టు 12న జియో గిగా ఫైబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5 నుంచి జియో గిగా ఫైబర్ సేవలు స్టార్ట్ అవుతాయి. బ్రాడ్ బాండ్ తో పాటు ఫిక్స్డ్ ఫోన్ సర్వీస్, ఉచిత 4కే టీవీ, జియో ఐవోటీ సర్వీసులు ఇవ్వనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి జియో గిగా ఫైబర్ పై పడింది. అందరూ అటువైపు వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పుడున్న డీటీహెచ్ కనెక్షన్ నుంచి జియోకి మారాలనుకోవడానికి ప్రధాన కారణం సెట్ టాప్ బాక్స్. అల్ట్రా హై డెఫినెషిన్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు గేమింగ్ కూడా ఉంటుంది. జియో గిగా ఫైబర్ ఎంట్రీతో భారతీ ఎయిర్ టెట్ కి పెద్ద ఎదురు దెబ్బ తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టెలికాం రంగంలో ఎయిర్ టెల్ కి జియో నుంచి గటి పోటీ ఎదురైంది. ఇప్పుడు డీటీహెచ్ బిజినెస్ లోనూ కష్టాలు తప్పేలా లేవు.

జియో గిగా ఫైబర్ సెట్ టాప్ బాక్స్ అందించే సర్వీసులు విషయానికి వస్తే..

* టీవీతో పాటు హై స్పీడ్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్, వీడియో కాలింగ్, వర్చువల్ రియాల్టీ, మిక్స్డ్ రియాల్టీ
* జియో ఫైబర్ ద్వారా ఉచిత ఓటీటీ కంటెంట్ చూడొచ్చు
* ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పేర్లు ఇంకా రివీల్ చెయ్యలేదు
* జియో సినిమా, జియో టీవీ, జియో సావన్ లాంటి ఓటీటీలు ఉచితం
* ఫస్ట్ డే ఫస్ట్ షో (ఏ సినిమా అయినా విడుదలైన తొలి రోజే తొలి షో ఇంట్లోనే చూసే వెసులుబాటు. ప్రీమియమ్ జియో ఫైబర్ కస్టమర్స్ కి మాత్రమే.)
* ఉచిత 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్స్
* దేశంలోని ప్రధాన నగరాల్లో జియో ఫైబర్ బ్రాండ్ బాండ్ అందుబాటులోకి రానుంది.
* ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, కోల్ కతా, జైపూర్, హైదరాబాద్, సూరత్, వడోదర, చెన్నై, నోయిడా, ఘజియాబాద్, భువనేశ్వర్, వారణాసి, అలహాబాద్, బెంగళూరు, సూరత్, ఆగ్రా, మీరట్, వైజాగ్, లక్నో, జంషెడ్ పూర్,  హరిద్వార్, గయా, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పంజాబ్ లో అందుబాటులోకి సేవలు.

ఎంఎస్ వో, హాత్ వే, డెన్, జీటీపీఎల్, 30 వేల లోకల్ కేబుల్ ఆపరేటర్లకు జియో గిగా ఫైబర్ ద్వారా ఇబ్బందులు తప్పేలా లేవు అని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. హాత్ వే, డెన్ కి 2.4 కోట్ల కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. జియో.. టెలికాం రంగంలో ప్రభంజనం సృష్టించింది. తక్కువ ధరకే డేటా ప్లాన్స్ ఇచ్చింది. దీంతో జియో కనెక్షన్ కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం 34 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇదే విధంగా డీటీహెచ్ మార్కెట్ ని శాసించాలని జియో చూస్తోంది.