Apple Layoff: రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేం.. యాపిల్‌ కంపెనీలో లే‌ఆఫ్‌ల విషయంపై స్పందించిన సీఈఓ టిమ్ కుక్..

గత కొద్దిరోజులుగా యాపిల్ కంపెనీలో లేఆఫ్‌లు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రకటనతో వారిలో

Apple Layoff: రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేం.. యాపిల్‌ కంపెనీలో లే‌ఆఫ్‌ల విషయంపై స్పందించిన సీఈఓ టిమ్ కుక్..

Apple CEO Tim Cook

Apple Layoff: కరోనా మహమ్మారి తరువాత ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ కంపెనీలు లే ఆఫ్ బాట పడుతున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, డెల్, మైక్రోసాప్ట్, సేల్స్ ఫోర్స్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు.. నష్టాలను తగ్గించుకొనేందుకు ఉద్యోగుల తొలగింపునే మార్గంగా ఎంచుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో యాపిల్ కూడా చేరిపోనుందని వార్తలు వస్తున్నాయి. గత నెలలో యాపిల్ కూడా లేఆఫ్ లు మొదలు పెట్టిన విషయం విధితమే. కాకపోతే కేవలం తక్కువ సంఖ్యలోనే ఉద్యోగులకు స్వస్తి పలికింది.

Cybersecurity Layoffs : ముందు రోజు ఉద్యోగులకు గ్రాండ్‌గా మందు పార్టీ.. మరుసటి రోజున అందరిని పీకేసింది.. టెక్ కంపెనీ భలే షాకిచ్చిందిగా..!

యాపిల్‌‌ కంపెనీ ఈసారి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. తాజా లేఆఫ్‌ల విషయంపై యాపిల్ సీఈఓ టీమ్ కుక్ స్పందించారు. అన్ని దార్లు మూసుకుపోయిన తరుణంలో చివరి అవకాశంగా మాత్రమే లేఆఫ్ ల గురించి ఆలోచిస్తామని క్లారిటీగా చెప్పారు. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే విషయంలో కంపెనీ తెలివిగా ప్రవర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం అందరూ అనుకుంటున్నట్లుగా లేఆఫ్‌లు ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అన్నారు. అయితే, లేఆఫ్ ల విషయాన్ని రానున్నకాలంలో పూర్తిగా కొట్టిపారేయలేమని చెప్పారు. కంపెనీలో ఉద్యోగుల నియామకాల ప్రక్రియ ఉంటుంది.. కానీ, తక్కువ సంఖ్యలో ఉద్యోగుల రిక్రూట్ మెంట్ జరుగుతుందని టిమ్ కుక్ చెప్పారు.

Red Hat Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన రెడ్‌ హ్యాట్.. 760 మందిని తొలగించేందుకు నిర్ణయం ..

గత కొద్దిరోజులుగా యాపిల్ కంపెనీలో లేఆఫ్ లు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రకటనతో వారిలో ఆందోళన తగ్గినప్పటికీ.. రాబోయే రోజుల్లో లేఆఫ్‌లు ఉండవని చెప్పేందుకు అవకాశం లేదని కుక్ అనడం గమనార్హం. ఇదిలాఉంటే.. ఆపిల్ తన మార్చి త్రైమాసికానికి 94.8 బిలియన్ల డాలర్ల రికార్డు ఆదాయాన్ని నివేధించింది. ఇది అంచనాల కంటే మెరుగ్గా ఉంది.

Amazon Layoffs: అయ్యో.. మరోసారి ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్‌.. భారీగా తొలగింపు

మార్చి త్రైమాసికంలో కంపెనీ 51.3 బిలియన్ డాలర్ల విలువ ఐఫోన్‌లను విక్రయించింది. ఇది కంపెనీకి సరికొత్త రికార్డు. యాపిల్ సర్వీసెస్ కూడా మార్చి త్రైమాసికానికి 20.9 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని కుక్ తెలిపారు. అంతేకాదు, యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్, పేమెంట్ సర్వీసెస్ లో ఆల్ టైమ్ రెవెన్యూ రికార్డులను సాధించామని కుక్ చెప్పారు.