Chicken Rates : కొండెక్కిన కోడి ధర

గత కొద్ది రోజులుగా చికెన్ ధర పెరుగుతోంది. ప్రస్తుతం చికెన్ ధర కిలో రూ.300 లకు చేరుకుంది. డిమాండ్ కు తగినంత సరఫరా లేకపోవటంతోనే రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెపుతున్నారు. కోవిడ్ నేపధ్యంలో చికెన్ వినియోగం గణనీయంగా పెరగటం కూడా చికెన్ రేట్లు పెరగటానికి కారణంగా చెపుతున్నారు.

Chicken Rates : కొండెక్కిన కోడి ధర

Chicken Rates

Chicken Rates : గత కొద్ది రోజులుగా చికెన్ ధర పెరుగుతోంది. ప్రస్తుతం చికెన్ ధర కిలో రూ.300 లకు చేరుకుంది. డిమాండ్ కు తగినంత సరఫరా లేకపోవటంతోనే రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెపుతున్నారు. కోవిడ్ నేపధ్యంలో చికెన్ వినియోగం గణనీయంగా పెరగటం కూడా చికెన్ రేట్లు పెరగటానికి కారణంగా చెపుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో చికెన్ రేటు రూ.300 దాటి అమ్ముతున్నారు. రేటు పెరిగినా వినియోగం మాత్రం తగ్గలేదని వ్యాపారస్తులు చెపుతున్నారు. సాధారణంగా ఏపీలో రోజుకు లక్షా 25 వేల బ్రాయిలర్ కోళ్లు అమ్మకం జరుగుతూ ఉంటే…. ఆదివారాలు ఈ సంఖ్య రెట్టింపై 2లక్షల 50 వేలకు చేరుకుంటోంది.

జూన్ 18న కిలో చికెన్ ధర రూ, 218 గా ఉంది. అది జులై 1నాటికి రూ.230కి చేరింది. అప్పటి నుంచి పెరుగుతూ   జులై19 కి రూ.296కి చేరింది. అంటే నెల రోజుల్లో కిలోకి రూ.78 లు, 19 రోజుల్లో రూ.66 కి పెరిగింది. గతేడాది మే 15న చికెన్ కిలో రూ. 312 కిచేరుకుని ఆల్ టైం రికార్డు సృష్టించింది.

సాధారణంగా హ్యాచరీల నిర్వాహకులు ప్రతి ఏటా మే ..జూన్ నెలల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఆ సమయాల్లో వీరు పౌల్ట్రీలకు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెలన్నర రోజుల క్రితం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హ్యాచరీల నిర్వాహకులు క్రాప్‌ హాలిడే అమలు చేశారు.  దీంతో ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడం తగ్గిపోయింది. దాదాపు నాలుగు వారాల నుంచి మళ్లీ కొత్త బ్యాచ్‌లు వేయడం మొదలు పెట్టారు. ఇవి 35 , 40 రోజుల్లో పెరుగుతాయి. ఆ బ్యాచ్ లో  వేసిన కోళ్లు త్వరలో  ఒక్కోటి  రెండు కిలోలలకు పైగా పెరుగుతుంది.

అందువల్ల చికెన్ రేట్లు రాగల రెండు,మూడు  వారాల్లో మరింత తగ్గుముఖం పడుతాయని  వ్యాపార వర్గాలు అంచానా వేస్తున్నారు. దీంతో అవసరమైన కోళ్లు అందుబాటులోకి వస్తే రేటు కిలో రూ. 250 కి దిగివచ్చి చికెన్ ప్రియులకు మరింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.