Chrome Users Alert : క్రోమ్ యూజర్లకు గూగుల్ అలర్ట్.. సెక్యూరిటీ ఫిక్స్ అప్‌డేట్ వస్తోంది.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Chrome Users Alert : గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్లకు అలర్ట్. మీరు వాడే క్రోమ్ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి. అత్యంత ప్రమాదకరమైన Zero- Day బ్రౌజర్ సమస్యను పరిష్కరించేందుకు Google Chrome డెస్క్‌టాప్ యూజర్ల కోసం Google కొత్త అప్‌డేట్ రిలీజ్ చేస్తోంది.

Chrome Users Alert : క్రోమ్ యూజర్లకు గూగుల్ అలర్ట్.. సెక్యూరిటీ ఫిక్స్ అప్‌డేట్ వస్తోంది.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Chrome for Windows and Mac getting an important security fix, Google says update now

Chrome Users Alert : గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్లకు అలర్ట్. మీరు వాడే క్రోమ్ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి. అత్యంత ప్రమాదకరమైన Zero- Day బ్రౌజర్ సమస్యను పరిష్కరించేందుకు Google Chrome డెస్క్‌టాప్ క్లయింట్ కోసం Google కొత్త అప్‌డేట్ రిలీజ్ చేస్తోంది. Mac, Linux, Windows కోసం Chrome డెస్క్‌టాప్ యాప్ ‘CVE-2022-3075’ లోపాన్ని సరిచేయనుంది. అందులో క్రోమ్ వెర్షన్ 105.0.5195.102కి అప్‌డేట్ చేసినట్టు Google చెబుతోంది. అయితే ఇప్పటివరకూ క్రోమ్ బ్రౌజర్‌లో బగ్ గురించి వివరాలపై స్పష్టత లేదు. మెజారిటీ క్రోమ్ యూజర్లు బగ్ ఇష్యూ ఫిక్స్ చేసేంతవరకు అదంతా పబ్లిక్‌గా ఉంటుందని Google చెబుతోంది.

హ్యాకర్లకు యూజర్ల డేటా బహిర్గతం కాకుండా అడ్డుకునేందుకు టెక్ కంపెనీలకు గూగుల్ అనేక సూచనలు చేస్తోంది. క్రోమ్ బగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా అప్‌డేట్ చేయనున్నట్టు Google ప్రకటించింది. ఆగస్ట్ 8న క్రోమ్ బ్రౌజర్‌లో భద్రతా లోపం ఉందని గుర్తించారు. CVE-2022-3075 జీరో-డే లోపం కారణంగా Mojoలో తగినంత డేటా వ్యాలీడ్ కాలేదు.

Chrome for Windows and Mac getting an important security fix, Google says update now

Chrome for Windows and Mac getting an important security fix, Google says update now

ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్ (IPC)లో ప్లాట్‌ఫారమ్‌లో అందించే రన్‌టైమ్ లైబ్రరీల కలెక్షన్ సూచిస్తుంది. CVE-2022-3075 అప్‌డేట్‌లో బగ్ ఉందని, లేటెస్ట్ అప్‌డేట్ ఆ బగ్ ఫిక్స్ చేయనున్నట్టు Google చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో Google Patch అనేది 6వ జీరో-డే భద్రతా లోపంగా చెప్పవచ్చు. సెక్యూరిటీ సంస్థ Kaspersky ప్రకారం.. Zero-Day అనేది హ్యాకర్లు సిస్టమ్‌లను హ్యాక్ చేసేందుకు వాడే భద్రతా లోపాల్లో ఎక్కువగా వాడే పదంగా పిలుస్తారు.

Google ఆన్‌లైన్ భద్రతను నిర్ధారించడానికి వీలైనంత త్వరగా యూజర్ల బ్రౌజర్‌లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తోంది. డెస్క్‌టాప్‌లో Google Chrome వెర్షన్ చెక్ చేయడానికి, బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి> టాప్ లెఫ్ట్‌లో ఉన్న 3 డాట్స్‌పై క్లిక్ చేయండి > Settings > About Chrome అని ఉంటుంది. అక్కడే URL బార్ పక్కన గ్రీన్ ఐకాన్ కనిపిస్తుంది. అంటే అక్కడ అప్‌డేట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందో Chrome సూచిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ మాన్యువల్‌గా చెక్ చేయడానికి, యూజర్లు పై విధంగా చెక్ చేసుకోవచ్చు.

Read Also : Google Chrome Extensions : గూగుల్ క్రోమ్‌లో ఈ 5 ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. ఇప్పుడే డిలీట్ చేయండి!