మానేస్తారా.. లేదా..? : పెరుగుతున్న సిగరెట్ రేట్లు

  • Published By: vamsi ,Published On : March 5, 2019 / 02:36 PM IST
మానేస్తారా.. లేదా..? : పెరుగుతున్న సిగరెట్ రేట్లు

పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెబుతున్నా పొగరాయుళ్లు మాత్రం సిగిరెట్‌ను మానలేకపోతున్నారు. అటువంటి వాళ్లకు షాక్ ఇచ్చే వార్త ఇది. సిగిరెట్ రేట్లు 15శాతం వరకు పెరగబోతున్నాయి. అవును ప్రస్తుతం ఉన్న సిగిరెట్ రేట్లకు త్వరలోనే రెక్కలు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న రేట్లను 15% పెంచే ఆలోచనలో ఐటీసీ బ్రాండ్ ఉంది. ఐటిసి బ్రిస్టల్ సిగరెట్ ధర రూ. 60 ఉండగా రూ .4 పెరిగి రూ. 64 కి చేరనుంది. Flake Excel ధర రూ. 6 పెరిగి రూ. 60 కానుంది. ఇంతకుముందు ఇది రూ.54కే అమ్మేవారు. ఇదిలా ఉండగా Capstan బ్రాండ్ కూడా రూ .7 పెరిగే అవకాశం ఉంది. అంతకుముందు దీని ధర రూ. 48 ఉండగా రూ.55కు చేరింది.కాగా సిగిరేట్ల ధరల పెంపు వార్తలతో ఐటీసీ లిమిటెడ్ వాటా 2 శాతం పెరిగింది.  బిఎస్ఈలో మంగళవారం రూ. 282.65 వద్ద ఐటీసీ షేర్లు ముగిశాయి. 
గత ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో ఐటీసీ 3,090.20 కోట్ల రూపాయల నికర లాభంతో ముగియగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 3,800 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. అంతకుముందు ఏడాది రూ.9,852.74 కోట్ల లాభం రాగా 15.09శాతం అమ్మకాలు పెరిగి గత సంవత్సరం ఆ లాభం రూ.11,340.15 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది గత ఏడాదితో పోల్చుకుంటే మొత్తం రాబడి కంటే 40 శాతం ఎక్కువ ఆదాయం రాగా 9.3 శాతం వృద్ధి చెంది రూ. 5,074 కోట్ల లాభాలు తొలి త్రైమాసికంలో వచ్చాయి. ఇఫ్పుడు సిగరేట్ల పెంపు నిర్ణయంతో రాబోయే త్రైమాసికాల్లో లాభాలు పెరగవచ్చునని సంస్థ భావిస్తున్నది.