ఈ కంపెనీ రూ.1కే 1GB సూపర్ ఫాస్ట్ Wi-Fi ఆఫర్ చేస్తోంది

  • Published By: sreehari ,Published On : February 7, 2020 / 12:50 AM IST
ఈ కంపెనీ రూ.1కే 1GB సూపర్ ఫాస్ట్ Wi-Fi ఆఫర్ చేస్తోంది

ప్రపంచంలో అతి చౌకైన ధరకే మొబైల్ డేటాను అందిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా ధరల గేమ్ మొదలైంది. అప్పటివరకూ ఆకాశాన్ని అంటిన డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి. జియోకు పోటీగా ఇతర టెలికం దిగ్గజాలు కూడా పోటీపడి డేటా ఆఫర్లను గుప్పించాయి. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. అయితే టెలికం రంగాన్ని షేక్ చేసిన రిలయన్స్ జియోకు Wi-Fi Dabba అనే బెంగళూరు స్టార్టప్ కంపెనీ వ్యక్తిగత యూజర్లకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తోంది. 

అది కూడా సూపర్ ఫాస్ట్ Wi-Fi నెట్ వర్క్. తక్కువ ఖరీదుతో కూడిన ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ (ISP) 1Gbps హైస్పీడ్‌తో ప్రీపెయిడ్ ప్లాన్ల కింద అతి తక్కువ ధర కేవలం రూ.1కే 1GB డేటాను ఆఫర్ చేస్తోంది. 2016లోనే ఈ స్టార్టప్ కంపెనీ Wi-Fi Dabba స్థాపించారు. 2020లో మొత్తం 100 సూపర్ నోడ్స్ వైఫై నెట్ వర్క్ ను నగరవ్యాప్తంగా విస్తరించనుంది. ఫైబర్ ద్వారా ఈ సూపర్ నోడ్స్ Wi-Fi Dabba నెట్ వర్క్ పనిచేయదు. ఫైబర్ కేబుల్ ఇన్ స్టాలేషన్ అయ్యే ఖర్చులో (1/10వ) పదోవంతు వరకు తగ్గిస్తుంది. 

ఇది పూర్తిగా ఇంటిలో నిర్మించిన యాజమాన్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగరంపై మెష్ చేసే లేజర్‌లను ఉపయోగిస్తుంది. ఈ లేజర్‌లు కంటికి సురక్షితంగా ఉంటాయి. ఎలాంటి జాప్యం లేకుండా 2 కిలోమీటర్ల దూరం వరకు కమ్యూనికేట్ చేయగలవు. సూపర్ నోడ్ దాని చుట్టూ ఉన్న పరిస్థితులను పర్యవేక్షించడానికి వాతావరణ సెన్సార్, సిసిటివి, ఇతర పరికరాలను కలిగి ఉంటుంది. థర్డ్ పార్టీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లేదా మౌలిక సదుపాయాలపై ఆధారపడనందున వై-ఫై డబ్బా యాజమాన్య హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ నెట్‌వర్కింగ్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం, బెంగళూరు వర్చువల్ టోపోలాజీ మ్యాప్‌ను రూపొందించడానికి కృషి చేస్తోంది. ఇది సూపర్ నోడ్ లను ఇన్‌స్టాల్ చేయడానికి అత్యంత అనుకూలమైన లొకేషన్లను ముందుగా ఎంచుకోవచ్చు. 

‘సూపర్ చీప్, సూపర్ ఫాస్ట్, ఇంటర్నెట్ యాక్సెస్ ను అందించడానికి 2017లో స్థాపించబడిన వై-ఫై దబ్బా బెంగళూరులో 1,000 హాట్‌స్పాట్‌లను 200 MBకి రూ .2 చొప్పున ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తోంది. ఇది నగరంలోని 10,000 అన్ని ప్రదేశాలకు కనెక్టివిటీని అందిస్తుంది. బెంగుళూర్, కర్ణాటక, మహారాష్ట్రలోని టైర్ -3 టైర్- IV పట్టణాల్లో తమ సేవలను అంతటా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి ఇతర కేబుల్ నెట్ వర్క్ మాదిరిగా Fibre optic కేబుల్స్ రోడ్ల కింద నుంచి కనెక్టవిటీ అవసరం లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి స్పెక్ర్టమ్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. నీళ్ల సంచి ధర కంటే తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను ఈ కంపనీ ఆఫర్ చేస్తోంది. Wifi Dabba నెట్ వర్క్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తి గల యూజర్లు కంపెనీ వెబ్ సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. 

Wifi Dabba ఎలా పనిచేస్తుందంటే? :
* Wi-fi dabba సర్వీసును తమ Wi-Fi routersతో లోకల్ షాపుల్లో ఇన్ స్టాల్ చేస్తోంది.
* మీ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా Wifi Dabba నెట్ వర్క్ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. 
* ఒకవేళ మీకు ప్రస్తుత డేటా ప్లాన్ లేదంటే.. రూ.1 తో 1GB డేటాను పొందవచ్చు.
* స్థానికంగా Wifi Dabba టోకెన్లను కూడా కొనుగోలు చేసుకోవచ్చు.
* ఆన్ లైన్ లో కూడా ఈ టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. 
* అవసరమైతే అధిక డేటా కావాలంటే కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.