పెరిగిన పెట్రోల్ ధరలు..ఎంతంటే!

  • Published By: madhu ,Published On : June 11, 2020 / 06:10 AM IST
పెరిగిన పెట్రోల్ ధరలు..ఎంతంటే!

కరోనా వేళ ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకులు అమాంతం ఎక్కువవుతుండడంతో సామాన్యుడు బేజార్ అయిపోతున్నాడు. దీనికి తోడు..రోజు రోజుకు పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తో ధరలు తగ్గాయి. ప్రస్తుతం సడలింపులు ఇవ్వడంతో చాలా మంది వాహనాలపై ప్రయాణిస్తున్నారు. వరుసగా ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

ఐదో రోజు కూడా చమురు సంస్థలు ధరలను పెంచేశాయి. 2020, జూన్ 11వ తేదీ గురువారం లీటర్ పై 60 పైసల చొప్పున పెంచారు. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్ ని బట్టి ధరలు మారుతూ ఉంటాయనే సంగతి తెలిసిందే. నఈ ఐదు రోజుల ధరలు గమనిస్తే..పెట్రోల్ ధర లీటర్ కు రూ. 2.74, డీజిల్ ధర రూ. 2.83కి పెరిగింది. 
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 73.40 నుంచి 74 రూపాయలకు పెరిగింది. డీజిల్ 71.62 రూపాయల నుంచి 72.22 రూపాయలకు పెరిగింది. 

చెన్నై : పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ. 70.64
ముంబైలో పెట్రోల్ రూ. 80.98. డీజిల్ రూ. 70.92
బెంగళూరు : పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66

హైదరాబాద్ : పెట్రోల్ రూ. 76.82. డీజిల్ రూ. 70.59
అమరావతి : పెట్రోల్ రూ. 77.36. డీజిల్ రూ. 71.18

Read: ఈ 19 చిన్న నేరాలకు శిక్షవద్దు!