కరోనా ఎఫెక్ట్: బ్యాంకులకు ఎవ్వరినీ రావొద్దన్న SBI

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 06:17 AM IST
కరోనా ఎఫెక్ట్: బ్యాంకులకు ఎవ్వరినీ రావొద్దన్న SBI

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ భయంతో వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 7వేలకు పైగా చేరింది. మన దేశంలో కరోనా కేసులు 125కు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం పంపింది. 

SBI రీసెంట్ గా బ్యాంకింగ్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ల కోసం SBI Yono (యూ నీడ్‌ ఓన్లీ వన్‌) అనే పేరుతో కొత్త యాప్‌ను అందుబాటలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ యాప్‌ను ఉపయోగించమని మార్చి 16న బ్యాంక్ ఖాతాదారులకు మెసేజ్‌లు పంపింది. కోవిడ్ 19 వైరస్ కారణంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ల కోసం బ్యాంక్ డిజిటల్ ఛానల్స్ ఉపయోగించండి అని SBI పేర్కొంది.

అంతేకాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కు అదనంగా యాప్ ద్వారా ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్‌ను ఆపరేట్ చేయొచ్చని SBI పేర్కొంది. సొంత అకౌంట్ లేదా ఇతరుల అకౌంట్‌కు డబ్బులు పంపొచ్చని… దీని కోసం బ్యాంకుకు రావాల్సిన అసవరం లేదని తెలిపింది.

See Also | షిర్డీ ఆలయం మూసివేత
 
కాగా మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, నెట్ బ్యాంకింగ్ మాత్రమే కాకుండా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్యాంక్ కస్టమర్లు బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చని తెలిపింది. ఏ ఆప్షన్ అయినా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే చాలా సేవలు ఇంటి నుంచి పొందే అవకాశం ఉంది. అన్నీ చోట్ల కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుంది కనుక ఎవ్వరూ బ్యాంక్ బ్రాంచులకు రావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుంచే ఈ డిజిటల్ ఛానల్స్‌ను ఉపయోగించుకోవడం మంచిది.