వెయ్యి కోట్లు ఫ్రీజ్: పాస్‌వ‌ర్డ్‌.. ఆ ఒక్కడికే తెలుసు! 

పుట్టినప్పుడు ఏది తీసుకరారు.. చచ్చినప్పుడు ఏది తీసుకపోరు అంటారు. పుట్టిన అప్పటినుంచి ఎన్నో కోట్లు గడించినా.. చివరికి చచ్చాక ఆరు అడుగులు స్థలం తప్ప ఏది వెంట రాదని అంటుంటారు.

  • Published By: sreehari ,Published On : February 6, 2019 / 02:13 PM IST
వెయ్యి కోట్లు ఫ్రీజ్: పాస్‌వ‌ర్డ్‌.. ఆ ఒక్కడికే తెలుసు! 

పుట్టినప్పుడు ఏది తీసుకరారు.. చచ్చినప్పుడు ఏది తీసుకపోరు అంటారు. పుట్టిన అప్పటినుంచి ఎన్నో కోట్లు గడించినా.. చివరికి చచ్చాక ఆరు అడుగులు స్థలం తప్ప ఏది వెంట రాదని అంటుంటారు.

పుట్టినప్పుడు ఏది తీసుకరారు.. చచ్చినప్పుడు ఏది తీసుకపోరు అంటారు. పుట్టిన అప్పటినుంచి ఎన్నో కోట్లు గడించినా.. చివరికి చచ్చాక ఆరు అడుగులు స్థలం తప్ప ఏది వెంట రాదని అంటుంటారు. ఇది నిజమే. ఎన్నో కోట్లు ఉన్నా ఏం లాభం.. చచ్చాక ఆ డబ్బు ఎవరో ఒకరు అనుభవించాల్సిందే కదా. పేరుకు కోటేశ్వరుడు. ఎన్నో కోట్లు కూడబెట్టాడు. ఓరోజు ఎవరూ ఊహించని రీతిలో మరణించాడు. అతడే.. క్రిప్టో కరెన్సీ సీఈఓ గెరాల్డ్ విలియం కొటెన్. కెన‌డాకు చెందిన క్రిప్టోక‌రెన్సీ ప్లాట్‌ఫామ్ క్వాడ్రిగా సైట్‌ను న‌డుపుతున్నాడు. ఇటీవల భారత్ పర్యటనలో 30ఏళ్ల గెరాల్డ్ అకస్మాత్తుగా మృతిచెందాడు.

దీంతో క్రిప్టో కరెన్సీ సైట్ లో డిజిటల్ కరెన్సీ దాదాపు వెయ్యి కోట్లు (190 మిలియన్ డాలర్లు- ఫిబ్రవరి 6 నాటికి ఎక్సేంజ్ రేటు) ఫ్రీజ్ అయ్యాయి. చచ్చిపోయే ముందు తన సైట్ పాస్ వర్డ్ ఎవరికి చెప్పకుండా చనిపోవడంతో ఆ సైట్లో కోట్లాది రూపాయలు స్తంభించిపోయాయి. ప్రపంచంలోని ఇండియా, కెనడా దేశాలకు సుపరిచితమైన క్రిప్టో కరెన్సీ (డిజిటల్ లేదా వర్ట్యూవల్ కరెన్సీ) సైట్ ఆలోచనలో భారీ భాగస్వామ్యం ఉంది. ఈ సైట్ వ్యవస్థాపకుడిగా కొటెన్.. 2013 డిసెంబర్ లో క్వార్డిగా సీఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సైట్ ను ప్రారంభించారు. అన్నీ తానై ముందుండి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ వైపు నడిపించాడు. 

హై సెక్యూరిటీ.. మిలియన్ డాలర్ల బిజినెస్..
క్వాడ్రిగా ప్లాట్‌ఫామ్ సైట్ పై.. మిలియన్ల డాలర్ల బిజినెస్ ఈ క్రిప్టో సైట్ నుంచే నడుస్తోంది. అందుకే ఈ సైట్..  హై సెక్యూరిటీతో రన్ అవుతోంది. రిజర్వ్ బ్యాంకు వంటి ఎలాంటి కేంద్ర వ్యవస్థలు దీనికి అవసరం లేదు. కేవలం క్రిప్టో కరెన్సీ సైట్ కు హైసెక్యూరిటీ పాస్ వర్డ్ లే ఫుల్ సెక్యూరిటీ. ఈ సైట్ రన్ చేసేందుకు గెరాల్డ్ తన కంప్యూటర్ హై సెక్యూర్ పాస్ వర్డ్ తో ప్రొటెక్ట్ చేశాడు. గెరాల్డ్ కంప్యూటర్ పాస్ వర్డ్ ఆయన బతికి ఉన్నరోజులు ఎవరికి చెప్పలేదు. ఉన్నట్టుండి గెరాల్డ్ మృతిచెందడంతో క్రిప్టో సైట్ లో వెయ్యి కోట్లు ఫ్రీజ్ అయ్యాయి. ఈ కంప్యూటర్ పాస్ వర్డ్ తెలియకపోవడంతో ఒక్కసారిగా ఆ సైట్ లో ట్రేడింగ్ నిలిచిపోయింది. వేలాది మంది క‌స్ట‌మ‌ర్లు ల‌బోదిబో అంటున్నారు.

గెరాల్డ్ వ్యాలెట్ లో వెయ్యి కోట్లు..
కెన‌డాలో బిట్‌కాయిన్‌, లైట్‌కాయిన్‌, ఎథీరియ‌మ్ క్రిప్టో ట్రేడింగ్ జ‌రుగుతుంది. క్వాడ్రిగాలో సుమారు 3.6 ల‌క్ష‌ల రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్లు ఉన్నారు. (బిట్ కాయిన్.. ఇదో రకమైన క్రిప్టో కరెన్సీ). ఇక్కడ ఎవరైనా డిజిటల్ కరెన్సీ రూపంలో ట్రేడ్ చేయొచ్చు. రూపాయిని కరెన్సీని ఎక్సేంజ్ చేసి బిట్ కాయిన్ కొనడం చేస్తుంటారు. భారీ లాభాలను గడిస్తుంటారు. గెరాల్డ్ కంప్యూట‌ర్‌లో ఉన్న కోల్డ్ వ్యాలెట్‌లో సుమారు వెయ్యి కోట్లు క్రిప్టో కాయిన్స్ స్టోర్ అయి ఉన్నాయి. ఈ సొమ్మును ఆన్‌లైన్ ద్వారా యాక్సెస్ చేయ‌డం సాధ్యం కానిపని.


గెరాల్డ్ మృతి చెందడంతో ఆ కంప్యూట‌ర్‌ను పాస్ వర్డ్ ఎవరికి తెలియకపోవడంతో ఫిజికల్ గా దాన్ని యాక్సెస్ చేయలేని పరిస్థితి నెలకొంది. అప్పటికే కొన్ని నెలలుగా క్వార్డిగా సీఎక్స్ లీగల్ సమస్యలను ఎదుర్కోంటోంది. ఈ సైట్ కస్టమర్లు తమ మనీని యాక్సస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనిపై క్రిప్టో ఎక్సేంజ్ కూడా 2018 డిసెంబర్ 4న ఫేస్ బుక్ పోస్టులో వివరణ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ పీరియన్స్ ట్రేడింగ్ ఎక్సేంజ్ యాక్సస్ సర్వీసులను మరింతగా మెరుగుపరిచే దిశగా దృష్టి సారిస్తోందని కెనడా ట్రేడర్లను ఉద్దేశించి ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది. 

కెనడా నుంచి భారత్ కు వచ్చి.. 
2019 జనవరిలో ఇండియాలోని ఓ అనాథ‌ శ్ర‌మాన్ని సందర్శించిన 30ఏళ్ల గెరాల్డ్‌.. జైపూర్ లోని మాల్వియా నగర్  ప్రాంతంలో క్రోన్స్ వ్యాధితో చనిపోయాడు. భార‌త ప్ర‌భుత్వం సైతం గెరాల్డ్ మృతికి సంబంధించి డెత్ స‌ర్టిఫికెట్‌ను రిలీజ్ చేసింది. గెరాల్డ్ మృతిపై ఇండియా డెత్ సర్టిఫికెట్ రిలీజ్ కావడంపై కెనడా ట్రేడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక గ్రాండ్ ఫ్యాంటాస్టిక్ స్కాం అంటూ ఆరోపిస్తున్నారు. భారత్ లో గెరాల్డ్ కు ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గెరాల్డ్ మృతిపై విచారణ జరిపేందుకు ఎవరో ఒకరు వస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని టాప్ రెడిట్ థ్రెడ్స్ వాదన.

క్రిప్టో సైట్ నుంచి 190 మిలియన్ల క్రిప్టో కాయిన్స్ ను క్వార్డిగా దోచుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గెరాల్డ్ చ‌నిపోవ‌డానికి 12 రోజుల ముందు భార్య పేరు మీద ఆయన వీలునామా రాశాడట. ఏది ఏమైనా.. గెరాల్డ్ వ్యాలెట్ క్రిప్టోలో స్టోర్ రూ.వెయ్యి కోట్లను ఎవరూ సొంతం చేసుకుంటారో తెలియదు. క్రెడిటర్లకు ఈ సొమ్ము దక్కుతుందా అంటే.. పాస్ వర్డ్ తెలిస్తే కానీ, ఏమిచేయలేని పరిస్థితి. ప్రస్తుతానికి సమాధానం దొరకలేదు.. ప్రశ్నగానే మిగిలింది.