ఆధార్ – పాన్ లింక్ గడువు పొడిగింపు

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 05:25 AM IST
ఆధార్ – పాన్ లింక్ గడువు పొడిగింపు

పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ (CBDT) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆదాయ పన్ను సేవలను మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధానం తప్పనిసరి చేసినట్లు చెప్పింది. ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 139 AA సబ్ సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును ఖచ్చితంగా అనుసంధానం చేసుకోవాలని CBDT ట్విట్టర్ వేదికగా  తెలిపింది.

ఆధార్, పాన్ తో అనుసంధాన గడువును పొడిగించడం ఇది వరుసగా 8వ సారి కావడం గమన్హారం. 2017 జూలై 01 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి తమ ఆధార్ నెంబర్ ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. పాన్ కార్డును  ఆదాయ పన్ను శాఖ ఇస్తుంది. ట్యాక్స్ పాలసీ నిబంధనలను సీబీడిటీ నిర్ణయిస్తుంది.