ముఖేశ్ అంబానీ టార్గెట్ సినిమా ధియేటర్సేనా

ముఖేశ్ అంబానీ టార్గెట్ సినిమా ధియేటర్సేనా

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్స్‌కు ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు. అంటే రిలీజ్ అయిన రోజు ఇంట్లోనే సినిమా చేసేయొచ్చన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవడానికి ఇదో సరికొత్త పద్ధతి. జియో వచ్చిన అనతికాలంలోనే ఇతర నెట్ వర్క్ లన్నింటినీ వెనక్కు నెట్టేసి నెం.1గా నిలిచింది. \మరి సినిమా రంగంలోనూ వేలు పెడుతున్న జియో ఫైబర్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి. దీనివల్ల వినియోగదారులకు, సినీ పరిశ్రమకు సత్ఫలితాలే రానున్నాయా.. అని ఓ సారి విశ్లేషిస్తే.. 

నిజానికి ఏ సినిమా రిలీజ్ అయినా ఎనిమిది వారాలు దాటకుండా డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి వీల్లేదు. నిర్మాణంలో భాగంగా ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడానికి ఆ యాప్ ఎనిమిది వారాల పాటు వెయిట్ చేసింది. సినిమా నిర్మాతలకు 40 నుంచి 70శాతం రెవెన్యూ తెచ్చిపెడుతున్న సోషల్ మీడియా యాప్‌ల వల్ల ప్రయోజనమే కానీ, ఇప్పుడు రిలీజ్ రోజునే ఇంట్లో ప్రసారం కావడమనేది ఓ రకంగా శోచనయమే. 

గతేడాది విడుదలై ప్రభంజనం సృష్టించిన బాహుబలి-2 ఐదు కోట్లకు మంది కంటే తక్కువ చూసినప్పటికీ 15వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. అటువంటిది జియో ఫైబర్ ఫస్ట్ డే రిలీజ్ ద్వారా ఏకంగా 50వేల కన్స్యూమర్లను దక్కించుకోవాలనుకుంటుంది. సంవత్సరానికి థియేటర్ల ద్వారా వచ్చే రెవెన్యూ రూ.13వేల కోట్లు ఆదాయం వస్తుంటే అంబానీ ఆలోచనతో రూ.50వేల కోట్లు చేజిక్కించుకోవాలనేదే ఆలోచన. 

తొలి రోజే సినిమా చూసేందుకు అవకాశం వస్తుందని వినియోగదారులు భావిస్తున్నా.. సినీ పరిశ్రమపై ఇది పెద్ద ప్రభావం చూపనుంది. జియో వచ్చిన కొత్తల్లో ప్రజల్లోకి వెళ్లాలనే దిశగా ఉచితంగా ఇచ్చిన అంబానీ.. నిదానంగా దానిపై నిర్దిష్ట ధరతో ప్యాక్‌లను సిద్ధం చేశాడు. దీంతో ప్రస్తుత మార్కెట్‌లో జియోను పోల్చుకునే మిగతా నెట్ వర్క్ లు నడుస్తున్నాయి. ఇదే విధంగా సినిమా పరిశ్రమలోనూ అంబానీ చొరబడితే ఇక సినీ వర్గాలు సైతం అంబానీనే ఫాలో కావాలి.