Dell layoff: ఉద్యోగాలకు కోత పెడుతున్న డెల్.. 6,650 మందిని తొలగించనున్న టెక్ సంస్థ

తాజాగా డెల్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. త్వరలోనే 6,650 మంది ఉద్యోగుల్ని తొలగించాలని డెల్ నిర్ణయించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కావడం గమనార్హం. ఇటీవల పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ తన నివేదికలో తెలిపింది.

Dell layoff: ఉద్యోగాలకు కోత పెడుతున్న డెల్.. 6,650 మందిని తొలగించనున్న టెక్ సంస్థ

Dell layoff: టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అమెజాన్, గూగుల్, ట్విట్టర్ బాటలోనే అనేక కంపెనీలు పయనిస్తున్నాయి. తాజాగా డెల్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. త్వరలోనే 6,650 మంది ఉద్యోగుల్ని తొలగించాలని డెల్ నిర్ణయించింది.

Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కావడం గమనార్హం. ఇటీవల పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఈ మేరకు కంపెనీ తన ఉద్యోగులకు మెమోలు అందజేసింది. డెల్ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థికపరమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, కంపెనీ అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల మధ్యే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ సీఓఓ జెఫ్ క్లార్క్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్న కంపెనీ.. కొత్త ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేసింది. డెల్ ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2020లో కోవిడ్ సంభవించిన సమయంలో కూడా భారీగా ఉద్యోగుల్ని తీసేసింది.

Delhi Mayor Poll: మూడోసారి వాయిదాపడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఆప్

ఇటీవలి కాలంలో పర్సనల్ కంప్యూటర్ల (పీసీలు) అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. గత త్రైమాసికంలో 37 శాతం అమ్మకాలు పడిపోయాయి. ఈ సంస్థకు 55 శాతం ఆదాయం పీసీల నుంచే వస్తుంది. వీటి అమ్మకాలు తగ్గడంతో ఆదాయం తగ్గింది. ఇటీవలి కాలంలో 28.5 శాతం పీసీల ఎగుమతులు తగ్గాయి. అంటే 65.3 మిలియన్ యూనిట్ల పీసీ అమ్మకాలు తగ్గాయి. డెల్ సంస్థతోపాటు హెచ్‌పీ అమ్మకాలు కూడా పడిపోయాయి. డెల్‌లో తాజా ఉద్యోగుల తొలగింపు ఏయే విభాగాల్లో ఉంటుందనే విషయంలో కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇప్పటివరకు వివిధ టెక్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తొలగించిన ఉద్యోగుల సంఖ్య 106,950గా ఉండొచ్చని ఒక అంచనా.