ఏం జరగబోతుంది : రూ.2వేల నోటు రద్దవుతుందా? చిత్తుకాగితం కాబోతున్నదా..

  • Published By: sreehari ,Published On : November 8, 2019 / 07:57 AM IST
ఏం జరగబోతుంది : రూ.2వేల నోటు రద్దవుతుందా? చిత్తుకాగితం కాబోతున్నదా..

మళ్లో నోట్ల రద్దు చేయబోతున్నారా? రూ.2వేలు నోట్లు కూడా రద్దు చేస్తారా? నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? చూస్తుంటే.. మరోసారి నోట్ల కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మళ్లీ ఏటీఎంల చుట్టూ తిరగాల్సిందేనా? దాచుకున్న నోట్లన్నీ చిత్తుకాగితాలుగా మారిపోనున్నాయా? అంటే అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.

దేశంలో బ్లాక్ మనీని నియంత్రించేందుకు 2016, నవంబర్ 8న రాత్రికి రాత్రే నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం అప్పట్లో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. ఏటీఎంల్లో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల్లో కూడా నగదు లేక అల్లాడిపోయారు. పెద్ద నోట్లు రద్దు చేసి ఈ రోజుకు (నవంబర్ 8,2019) సరిగ్గా మూడేళ్లు అవుతుంది.

ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నోట్లరద్దు తర్వాత చెలామణీలోకి తెచ్చిన రూ.2వేలు నోట్లను కేంద్రం మళ్లీ రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సలహా సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే మాత్రం నోట్ల రద్దు ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే దేశంలోని అత్యంత విలువైన పెద్ద నోట్లను రద్దు చేయాలనే సూచనలను కేంద్రానికి ఓ 72పేజీల నోట్ నోట్ అందినట్టు విశ్వసనీయ సమాచారం. విద్యుత్ కార్యదర్శిగా ఉన్న సుభాష్.. అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. అంతకుముందే ఆర్థిక కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ఆర్థిక కార్యదర్శి సూచలన మేరకు మోడీ ప్రభుత్వం నోట్ల రద్దుకు మొగ్గు చూపుతుందా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2016 నోట్ల రద్దు (రూ.500, రూ.వెయ్యి) నిర్ణయం తర్వాత చెలమణీలోకి తెచ్చిన రూ.2వేల నోట్లు పెద్దగా కనిపించడం లేదు. రూ.2వేలు నోట్లతో బ్లాక్ మనీ రూపంలో దాచిపెడుతున్నారా అనే సందేహలు వ్యక్తమవు తున్నాయి. పెద్దగా చెలామణీలోని లేని రూ.2వేల నోట్లను రద్దు చేయడం వల్ల వచ్చే సమస్య ఏమి ఉండదని మాజీ ఆర్థిక సెక్రటరీ నోట్ లో ప్రస్తావించారు. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రస్తుత స్టాక్స్, వివిధ నోట్లపై కొత్త ఫ్రింటింగ్ వంటి విషయంలో పునరాలోచిస్తోంది.

ఈ క్రమంలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన నోట్లను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే యోచిస్తోంది. బ్లాక్ మనీని అరికట్టేందుకు రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన కేంద్రం.. వాటి స్థానంలో కొత్త రూ.200, రూ.2వేల నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. ఇప్పటికే రూ.2వేలు నోట్ల ముద్రణ కూడా క్రమంగా తగ్గిస్తూ వస్తోంది.

ఈ ఏడాదిలో కొత్త రూ.2వేల నోట్లను ముద్రించలేదని ఓ నివేదిక తెలిపింది. ఈ నోట్లను చెలామణీలో ఉండటం కారణంగా స్మగ్లింగ్ వంటి అక్రమ వ్యవహారాలకు దారి తీస్తుందని ఆర్టీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో రూ.6 కోట్ల విలువైన రూ.2వేల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఒకప్పటి నోట్ల రద్దు నిర్ణయం కూడా నవంబర్ 8నే ప్రకటించడంతో మరోసారి నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని హడలి చస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి దాటేవరకు చెప్పలేం. కేంద్రం ఏ క్షణంలోనైనా నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం లేకపోలేదు. మాజీ ఆర్థిక కార్యదర్శి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటుందో లేదా చూడాలి.