Disney Lays Off : డిస్నీ ఉద్యోగులకు షాక్..7,000 మంది తొలగిస్తున్నట్లు ప్రకటించిన CEO

హాలీవుడ్ ఎంటర్‌టైన్మెంట్ దిగ్గజం ‘ది వాల్ట్ డిస్నీ’ కంపెనీకూడా తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వంద వేలు కాదు ఏకంగా 7,000మంది ఉద్యోగుల్ని తొలగించక తప్పదంటూ ప్రకటించారు కంపెనీ సీఈవో బాబ్ ఐగర్..!

Disney Lays Off : డిస్నీ ఉద్యోగులకు షాక్..7,000 మంది తొలగిస్తున్నట్లు ప్రకటించిన CEO

Disney Lays Off

Disney Lays Off :   ’Lays Off..Lays Off..Lays Off ’ చిన్న సంస్థల నుంచి బడా బడా సంస్థల్లోనూ ప్రతిధ్వనిస్తున్న అత్యంత ఆందోళన కలిగించే మాట. ఇది చిన్న పదమే అయినా ఉద్యోగుల జీవితాలను తల్లక్రిందులు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా డెల్,పేపాల్,గూగుల్,అమెజాన్,జొమాటో, ఇంటెల్,జూమ్,ఈబే,ట్విట్టర్, మైక్రోసాఫ్ట్,గూగుల్, ఫేస్‌బుక్‌,ఆఖరికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ కూడా ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఈక్రమంలో హాలీవుడ్ ఎంటర్‌టైన్మెంట్ దిగ్గజం ‘ది వాల్ట్ డిస్నీ’ కంపెనీకూడా తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వంద వేలు కాదు ఏకంగా 7,000మంది ఉద్యోగుల్ని తొలగించక తప్పదంటూ ప్రకటించారు కంపెనీ సీఈవో బాబ్ ఐగర్..!

Zoom Layoffs: ఉద్యోగాలకు కోత పెడుతున్న జూమ్.. 1300 మందిని తొలగించేందుకు సిద్దం

ఇప్పటికే ఉద్యోగులు తొలగింపు ప్రక్రియకి సిద్ధమైంది వాల్ట్ డిస్నీ సంస్థ. ఉద్యోగుల తొలగింపు బాధాకరమే అయినా తప్పని పరిస్థితి అని..ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు సీఈవో. డిస్నీ ఓటీటీ సర్వీస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో తగ్గటంతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి ఉద్యోగుల తొలగింపు తప్పదని తెలిపారు. బహుశా ఆర్థిక మాద్యం వల్ల వినియోగదారులు కూడా తమ తమ ఖర్చులను తగ్గించుకోవటంతో డిస్నీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. 2022లోనే డిస్నీ గ్రూప్ సంస్థల బాధ్యతలు చేపట్టిన బాబ్ ఐగర్ మా సంస్థ ఉద్యోగులు కంపెనీ కోసం పడిన శ్రమను గౌరవిస్తామని వారి కష్టాన్ని అర్థం చేసుకున్నామని కానీ ఇటువంటి పరిస్థితి తప్పలేదని ఆవేదనతో వెల్లడించారు ఉద్యోగుల తొలగింపు విషయాన్ని. ప్రారంభంలో డిస్నీ నెట్ ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ లకు గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు సీఈవో బాబ్ ఐగర్.వినియోగదారుల కోసం ఈ పోటీ ప్రపంచంలో ఆఫర్లు కూడా భాగమయ్యాయన్నారు.

EBay ‘Layoff : వందలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న EBay..

గత త్రైమాసికంలో డిస్నీ ఓటీటీ సర్వీస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక శాతం మేర తగ్గి 168.1 మిలియన్లకు పడిపోయారు. డిసెంబర్ 31న మూడు నెలల క్రితంతో పోలిస్తే సబ్‌స్క్రైబర్లు 161.8 శాతమంది తగ్గారు. దీంతో తమ ఖర్చుల్ని తగ్గించుకోవటానికి డిస్నీ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఖర్చులు తగ్గించుకునేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇదొక భాగమని ఆర్థిక విశ్లేకులు చెబుతున్నారు. గత త్రైమాసికంలోడిస్నీ స్ట్రీమింగ్ సర్వీస్ నిర్వహణ నష్టాలు కొంతమేర తగ్గించుకోగలిగింది. దీంతో.. ఇన్వెస్టర్లకు సంస్థపై భరోసా పెరగడంతో పోస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్ ధర 8 శాతం మేర వృద్ధి నమోదు చేసుకుంది.

Boeing Layoff : లేఆఫ్‌ల బాటలో విమానాల తయారీ సంస్థ బోయింగ్ .. వేలాదిమంది ఉద్యోగులు తొలగింపు

అంతేకాకుండా.. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను దాటి డిస్నీ గ్రూప్ 23.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. సుమారు రెండు దశాబ్దాల పాటూ డిస్నీకి నేతృత్వం వహించిన బాబ్ ఐగర్ 2020లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గతేడాదే ఆయన మళ్లీ సంస్థ బాధ్యతలను చేపట్టారు. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం రీత్యా డిస్నీ కూడా ఖర్చులు తొలగించుకునే పనిలో ఉద్యోగుల తొలగింపు చేస్తోంది.