మార్పు మంచిదే : ఇక అన్నీ డబుల్ డెక్కర్ విమానాలే

  • Published By: nagamani ,Published On : November 26, 2020 / 12:31 PM IST
మార్పు మంచిదే : ఇక అన్నీ డబుల్ డెక్కర్ విమానాలే

double decker planes : కరోనా తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు..ప్రపంచంలోని ప్రజలందరి జీవితాల్నే మార్చేసింది. తినే తిండి..ఖర్చులు, ప్రయాణాలు, ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీంటిలోనే కరోనా తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా జనాలకు ఇంటికే పరిమితం చేసిపారేసింది.



ఈక్రమంలో వచ్చిన మార్పుల విషయానికి వస్తే..ఇప్పటి వరకూ మనం డబుల్ డెక్కర్ బస్సుల్ని చూశాం.డబుల్ డెక్కర్ రైళ్లను కూడా చూశాం. కానీ ఈ కరోనా ప్రభావంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇకనుంచి విమానాలు కూడా డబుల్ డెక్కర్ గా మారిపోతున్నాయి.
https://10tv.in/uae-temporary-visa-restrictions-on-muslim-countries/


త్వరలో ఇక విమానాలన్నీ డబుల్ డెక్కర్ విమానాలుగా మారిపోనున్నాయి. రాబోయే రోజుల్లో విమానాల్లో డబుల్ డెక్కర్ సీట్లు రానున్నాయి. ప్రస్తుతం విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణించేవారికి లిమిటెడ్ లెగ్ రూమ్‌లు ఉన్నాయి.



ఇకపై ఇవిఉండవు. విమానం మొత్తంగా డబుల్ డెక్కర్ సీట్లే ఉంటాయి. అయితే విమానాల్లో డబుల్ డెక్కర్ పరిణామానికి దారి తీసింది కరోనానే అని చెప్పక తప్పదు గాక తప్పదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విమానాల్లో ఈ కొత్త సీటింగ్ విధానాన్ని తీసుకువస్తున్నారు. వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య దూరం అంటూ భౌతిక దూరం ఉండేలా ఈ సీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. డిజైనర్ జాఫ్రీ ఓనీల్‌తో విమానయాన సంస్థలు 2-4-2 కాన్ఫిగరేషన్ సీటింగ్ అందించనున్నాయి.



డబుల్ డెక్కర్ సదుపాయం వస్తే విమానాల్లో ప్రయాణించే వారిలో 70 శాతం మంది లై ఫ్లాట్ ఏంగిల్ లో నిద్రపోవచ్చు. ప్రయాణికులందరికీ సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందిస్తూ.. ప్రజలకు డబ్బును ఆదా చేస్తుందీ పద్దతి అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఎకానమీ క్లాస్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సాయపడుతుంది.



సుదూరం విమాన ప్రయాణాల్లో నిద్రంచటానికి వీలుగా ఉండేలా సీటింగ్ డిజైన్ ఉంటుంది. ఇప్పటికే ఉన్న సీటింగ్ లను డబల్ డెక్కర్ సీట్లను మారుస్తున్నారు. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా పెరుగుతున్న ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని..పైగా దానికి తగిన ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా డబుల్ డెక్కర్ సీట్లను తయారుచేయిస్తున్నారు.



ఈ డబుల్ డెక్కర్ సెటప్ చేస్తే ప్రయాణీకుల సంఖ్య పెరగటంతో పాటు దానికి తగిన ఆదాయం కూడా వస్తుందని మరోపక్క భౌతికదూరం పాటించినట్లుగా కూడా ఉంటుందని వాటితో పోల్చుకుంటే ఇది పెద్ద భారం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.