సంక్రాంతి పండుగ వేళ..బంగారు దుకాణాలు కళకళ

సంక్రాంతి పండుగ వేళ..బంగారు దుకాణాలు కళకళ

Sankranti festival: సంక్రాంతి పండుగ సందర్భంగా..బంగారు దుకాణాలకు తాకిడి అధికమైంది. దీంతో కొనుగోలు దారులతో షాపులన్నీ కళకళలాడాయి. నగరంలో ఉన్న పలు జ్యువెల్లరీ దుకాణాలు సందడిని తలపించాయి. అమీర్ పేట, ఆబిడ్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ మార్కెట్ లో ఉన్న పలు దుకాణాల్లో కొనుగోళ్ల జోరు కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్ లో 2021, జనవరి 13వ తేదీ బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46 వేల 200 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50 వేల 400కి చేరింది. మంగళవారంతో పోలిస్తే..ధర రూ. 207కి పెరిగింది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. వెండి ఏకంగా రూ. 600 పెరగడం గమనార్హం. కిలో వెండి ధర రూ. 69 వేల 600కి చేరింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా..పసిడి ధరల్లో మార్పులు జరుగుతుంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.  2021, జనవరి 14వ తేదీ గురువారం బంగారం ధరలు ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెకట్ల బంగారం రూ. 46 వేల 000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా 50వేల మార్క్ నుంచి కొద్దిగా పేరి రూ. 50 వేల 400 రూపాయలుగా నిలిచింది.

బుధవారం నాటి ప్రారంభ ధరకంటె 500 రూపాయల పెరుగుదల నమోదు చేయడంగో చేసి 66 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగబాకాయి. బుధవారం నాటి ప్రారంభ ధరకంటె 500 రూపాయల పెరుగుదల నమోదు చేసి 66 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగబాకాయి