అతి త్వరలో….మేడిన్ ఇండియా ఫ్లయింగ్ కార్లు వచ్చేస్తున్నాయి

  • Published By: venkaiahnaidu ,Published On : March 10, 2020 / 01:55 PM IST
అతి త్వరలో….మేడిన్ ఇండియా ఫ్లయింగ్ కార్లు వచ్చేస్తున్నాయి

భారత్ లో అతి త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి. అయితే ఇందులో మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఈ ఎగిరే కార్లు భారత్ లోనే తయారుచేయబడనున్నాయి. గాల్లో ఎగిరే కార్లను తయారుచేసే నెదర్లాండ్స్ కు చెందిన PAL-V కంపెనీ త్వరలో గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సమక్షంలో….రాష్ట్ర ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్ కే దాస్,PAL-V ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ కార్లో మాస్ బొమ్మెల్ MOUపై సంతకాలు చేశారు.

2021నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలన్న లక్ష్యంతో గుజరాత్ లో PAL-V కంపెనీ ఫ్లాంట్ ను ఏర్పాటు చేయబోతుంది. గుజరాత్ లో ఫ్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంలో PAL-Vకి సహాయం చేయనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. భారత్ లో ఇలాంటి ఫ్లాంట్ ఇదే మొదటిది అని గుజరాత్ సర్కార్ తెలిపింది.

గుజరాత్ లోనే ఫ్లాంట్ ఎందుకు 
గుజరాత్ లో మంచి పోర్ట్,లాజిస్టిక్ సౌకర్యాలు,ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్,వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని తమ కంపెనీ గుజరాత్ రాష్ట్రాన్ని ఫ్లాంట్ పెట్టేందుకు సెలక్ట్ చేసుకున్నట్లు PAL-V ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ కార్లో మాస్ బొమ్మెల్ తెలిపారు. 2021నాటికి కార్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని,అంతేకాకుండా భారత్ లో తయారైన ఫ్లయింట్ కార్లు,అమెరికా,యూరప్ దేశాలు సహా ప్రపంచంలోని పలు దేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయని మాస్ బొమ్మెల్ తెలిపారు. 110 ఫ్లయింట్ కార్లు ఎగుమతి చేయాలని ఇప్పటివరకు PAL-Vకి ఆర్డర్లు వచ్చాయని మాస్ బొమ్మెల్ గుజరాత్ సీఎంకు తెలిపారు.

PAL-Vఫ్లయింగ్ కారు ప్రత్యేకతలు
ఈ కారుకి రెండు ఇంజిన్స్ ఉంటాయి. రోడ్డుపై ఈ కార్లు 160కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. 180కిలీమీటర్ల వేగంతో గాల్లో ఎగురగలవు. కేవలం మూడు నిమిషాల్లోనే ఫ్లయింగ్(ఎగిరే)వెహికల్ గా ఈ కారు మారిపోగలదు మరియు ఫుల్ ట్యాంక్ తో 500కిలీమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు.