eSIM సపోర్ట్‌తో Oppo ఫస్ట్ స్మార్ట్ వాచ్ .. ఆపిల్ వాచ్‌లానే ఉంది!

చైనా టెక్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చింది. ఇటీవల చైనాలో Find X2 లాంచ్ ఈవెంట్లోనే ఒప్పో ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ అధికారికంగా ప్రవేశపెట్టింది. చైనీస్ బ్రాండ్ నుంచి మొట్టమొదటిసారిగా స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వచ్చింది.

eSIM సపోర్ట్‌తో Oppo ఫస్ట్ స్మార్ట్ వాచ్ .. ఆపిల్ వాచ్‌లానే ఉంది!

చైనా టెక్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చింది. ఇటీవల చైనాలో Find X2 లాంచ్ ఈవెంట్లోనే ఒప్పో ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ అధికారికంగా ప్రవేశపెట్టింది. చైనీస్ బ్రాండ్ నుంచి మొట్టమొదటిసారిగా స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 గాడ్జెట్ కు పోటీగా ఒప్పో ఈ స్మార్ట్ వాచ్ రిలీచ్ చేసింది. ఇది చూడటానికి అచ్చం Apple Watch Series 4 మాదిరిగానే కనిపిస్తోంది.
Oppo watch

ఒప్పో వాచ్‌ ఫీచర్లలో AMOLED డిస్‌ప్లేతో 3D కర్వడ్ గ్లాసు, VOOC ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు ECG సెన్సార్ బోర్డు అందిస్తోంది. ఒప్పో వాచ్ రాయల్ లుక్.. ఆపిల్ వాచ్ లాగా ఉన్నప్పటికీ ధర మాత్రం తక్కువే. 17 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంపై 40 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. బ్యాటరీ సేవింగ్ మోడ్ ద్వారా 21 రోజుల వరకు బ్యాటరీ ఛార్జింగ్ వస్తుంది.

ధర ఎంతంటే? :
ఒప్పో వాచ్ రెండు పరిమాణాల్లో వచ్చింది. చిన్న సైజు 41mm వెర్షన్ వాచ్ ధర CNY 1,499 (రూ.16,000)గా నిర్ణయించగా, పెద్ద సైజు 46MM వాచ్ ధర CNY 1,999 (రూ.21,400)గా నిర్ణయించింది కంపెనీ. ఈ ఒప్పో స్మార్ట్ వాచ్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అయింది.

కానీ, ఈ ప్రొడక్టును భారత్ సహా ఇతర మార్కెట్లో కూడా తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. భారత స్మార్ట్ వాచ్ వేరబుల్ మార్కెట్లలో మిడ్ రేంజ్ సిగ్మెంట్లలో నాయిజ్, హుమాయి బ్రాండ్లకు బాగా డిమాండ్ ఉంది. శాంసంగ్, ఆపిల్ వాచ్ లు మాత్రం ప్రీమియం కొనుగోలుదారులను ఆకర్షించేలా ఉంది.
oppo watchs

స్పెషిఫికేషన్లు :
* 1.6 అంగుళాలు, 1.9-అంగుళాల డిస్‌ప్లే పరిమాణాలు
* 3D కర్వడ్ AMOLED ప్యానెల్, 100% DCI-P3 కలర్ గ్మాంట్
* రెండు ఫిజికల్ స్మార్ట్ బటన్లు (రైట్ సైడ్)
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 2500 ప్రాసెసర్, Apollo 3 కో-ప్రాసెసర్
* ColorOS ఆపరేటింగ్ సిస్టమ్, లేటెస్ట్ చిప్ సెట్స్
* eSIM సపోర్ట్, రీసీవ్ కాల్స్, SMS సెండింగ్ ఆప్షన్
* VOOC ఛార్జింగ్ టెక్నాలజీ
* నేవిగేషన్ సపోర్ట్
* గోల్డ్, బ్లాక్ కలర్ ఆప్షన్లు
* ECG ఫంక్షనాల్టీ

See Also | భర్త పోయాడు.. తండ్రీ పోయాడు.. అమృత సంచలన నిర్ణయం!