డిజిటల్ కరెన్సీని సృష్టిస్తున్నారు : ఫేస్ బుక్ బిట్ కాయిన్ వస్తోంది

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ సెక్టార్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. బిట్ కాయిన్ తరహాలో సొంత డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : May 4, 2019 / 07:55 AM IST
డిజిటల్ కరెన్సీని సృష్టిస్తున్నారు : ఫేస్ బుక్ బిట్ కాయిన్ వస్తోంది

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ సెక్టార్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. బిట్ కాయిన్ తరహాలో సొంత డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. బిట్ కాయిన్ ట్రేడింగ్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. బిట్ కాయిన్ తరహాలో సొంత Digital Currency ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో Facebook క్రిప్టోకరెన్సీ బేసిడ్ పేమెంట్స్ ప్లాట్ ఫాంను లాంచ్ చేసేందుకు ప్లాన్ రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే తన సోషల్ ప్లాట్ ఫాంపై 2.38 బిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.

ఈ సరికొత్త డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాంతో డిజిటల్ కాయిన్స్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఫేస్ బుక్ పనిచేస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. డజన్లకు పైగా ఫైనాన్షియల్ సంస్థలు, ఆన్ లైన్ మర్చెంట్లతో ఫేస్ బుక్ కాయిన్ల చెల్లుబాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. Cryptocurrency బేసిడ్ సిస్టమ్ ద్వారా Digital Coins  ప్రత్యేక వ్యాలెట్ల ద్వారా క్రయవిక్రయాలు జరుపుతుంటారు. ఫేస్ బుక్ కాయిన్స్ కూడా బిట్ కాయిన్స్ మాదిరిగానే చెల్లుబాటు అవుతాయి.  

ట్రేడింగ్ మార్కెట్లో స్థిరంగా ఉండే క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ FB Coin బిజినెస్ ప్రాజెక్ట్ కోసం ఫేస్ బుక్.. 1 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘FB Coin’ పేరుతో సొంత ప్లాట్ ఫాంపై యూజర్లకు అందించేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు ఏడాదిగా రూమర్లు వస్తూనే ఉన్నాయి.  

ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ జనరల్ (WSJ) నివేదిక రిలీజ్ కావడంతో  Facebook Coins (బిట్ కాయిన్స్) త్వరలో నిజంగానే మార్కెట్లోకి రాబోతున్నాయనే వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది. అంతేకాదు.. ఫేస్ బుక్ బిట్ కాయిన్స్ పేమెంట్స్ ద్వారా తమ యూజర్లకు Rewards పాయింట్లు కూడా ఇవ్వాలనే యోచనలో సంస్థ ఉన్నట్టు నివేదిక తెలిపింది.

దీని ప్రకారం.. ఫేస్ బుక్ సొంత బిట్ కాయిన్స్ ప్రవేశపెట్టే ప్లాన్ లో భాగంగా ప్రస్తుతం మేజర్ పేమెంట్స్ నెట్ వర్క్స్ పేమెంట్ ప్రాసిసర్ ఫస్ట్ డేటా కార్పొరేషన్ తో పాటు Visa, Master Card సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది.