FB యాప్స్, సర్వీసుల్లో BUG కనిపెట్టండి : రూ.35 లక్షలకు పైగా క్యాష్ ప్రైజ్ మీదే

  • Published By: sreehari ,Published On : October 16, 2019 / 11:32 AM IST
FB యాప్స్, సర్వీసుల్లో BUG కనిపెట్టండి : రూ.35 లక్షలకు పైగా క్యాష్ ప్రైజ్ మీదే

డిజిటల్ ప్లాట్ ఫాంపై దేనికీ పూర్తి స్థాయిలో ప్రైవసీ ఉండదు. హ్యాకర్ల నుంచి తమ డేటాను కాపాడుకోవడానికి ఎన్నో రకాల సంస్థలు భద్రతపరమైన చర్యలను చేపడతాయి. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట భద్రతపరమైన లోపాలు ఉంటాయి. ఈ చిన్న లోపాలను హ్యాకర్లు టార్గెట్ చేసి హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు. ఏదైనా టెక్నాలజీ కంపెనీ ఒక యాప్ లేదా సర్వీసును ప్రారంభించినప్పుడు వీలైనంతర వరకు టెస్టింగ్ చేస్తుంటుంది. ఏమైనా బగ్స్ లేదా లోపాలు ఉంటే వెంటనే ఫిక్స్ చేసి అప్ డేట్స్ రిలీజ్ చేస్తుంటాయి. 

కానీ, కొన్నిసార్లు రూపొందించిన యాప్స్ లో బగ్స్ రహస్యంగా తిష్టివేసి ఉంటాయి. ఇలాంటి బగ్స్ ను గుర్తించేందుకు కంపెనీలే హ్యాకర్లకు సవాల్ విసురుతుంటాయి. తమ యాప్ సర్వీసుల్లో బగ్ కనిపెట్టిన వారికి భారీ మొత్తంలో పారితోషకం ఆఫర్ చేస్తుంటాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా తమ యాప్స్ లేదా సర్వీసుల్లో ఏదైనా బగ్, భద్రత పరమైన లోపాలు ఉన్నాయో కనిపెట్టాలని ఆఫర్ చేస్తోంది. 

‘బగ్ బౌంటీ ప్రొగ్రామ్’ పేరుతో ఈ స్పెషల్ కాంటెస్టును ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనే పోటీదారులను థర్డ్ పార్టీ యాప్స్ లో భద్రతపరమైన లోపాలను తప్పక గుర్తించాలని కండీషన్ పెట్టింది. రియల్ టైమ్ లో యాప్స్ టెస్టింగ్ చేసి అందులోని లోపాలను బౌంటీ పోటీదారులు గుర్తించాల్సి ఉంటుంది. బగ్స్ గుర్తించినవారికి ఫేస్ బుక్ రూ.35లక్షలకు పైగా క్యాష్ ప్రైజ్ ఇవ్వనుంది. కొత్త పాలసీల ప్రకారం.. బౌంటీ హంటర్లు.. ఎవరైతే యాప్స్, సర్వీసుల్లోని భద్రత లోపాలను (లో సెక్యూరిటీ థ్రెట్స్) గుర్తిస్తారో కనిష్టంగా 500 డాలర్ల (రూ. 35వేల 732) వరకు క్యాష్ ప్రైజ్ ఇవ్వనుంది. 

అంతేకాదు.. స్థానిక యాప్స్ లోని బగ్స్, భద్రత లోపాలను గుర్తించినవారికి వెయ్యి డాలర్ల నుంచి 15వేల డాలర్ల వరకు బోనస్ గా ఫేస్ బుక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇదంతా పోటీలోని ఫైనల్ బౌంటీలో యాడ్ అవుతుంది. రిపోర్టుల ప్రకారం.. ఫేస్ బుక్.. ఒక ప్రత్యేకమైన బగ్ కనిపెట్టిన వారికి గరిష్టంగా 50వేల డాలర్ల వరకు చెల్లించనుంది. ఇంకెందుకు ఆలస్యం..యాప్స్ టెస్టింగ్ లో మీరు సమర్థులా.. ఫేస్ బుక్ నిర్వహించే బగ్ బౌంటీ ప్రొగ్రామ్ లో పాల్గొనండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.