కేంద్రం సంచలన నిర్ణయం : దేశంలోని బ్యాంకులన్నీ విలీనం

  • Published By: venkaiahnaidu ,Published On : August 30, 2019 / 11:30 AM IST
కేంద్రం సంచలన నిర్ణయం : దేశంలోని బ్యాంకులన్నీ విలీనం

250 కోట్లకు మించి తీసుకున్న రుణాలను మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతామారన్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-30,2019)ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రాస్ నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్స్ 8.65 లక్షల కోట్ల నుంచి 7.90లక్షల కోట్లకు దిగి వచ్చాయన్నారు.

బ్యాంకుల విలీనం పైనే నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB),ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లు విలీనం అవబోతున్నాయని, 17.95 లక్షల కోట్ల బిజినెస్ తో రెండవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించనున్నట్లు ఆమె తెలిపారు. 

సిండికేట్ బ్యాంకు,కెనరా బ్యాంక్  విలీనం ద్వారా 15.20లక్షల కోట్ల బిజినెస్ తో  నాల్గవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించబోతున్నట్లు ఆమె తెలిపారు.
 
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఇకపై ఒకే బ్యాంకుగా అయ్యి  ఐదవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా ఇప్పుడు అవతరించినట్లు ఆమె తెలిపారు.

అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ విలీనం ద్వారా 8.08లక్షల కోట్లతో ఏడవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా అవతరించబోతున్నట్లు ఆమె తెలిపారు.

జాతీయ స్థాయి కలిగిన…9.3లక్షల కోట్ల వ్యాపారంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4.68లక్షల కోట్ల వ్యాపారంతో సెంట్రల్ బ్యాంకు కంటిన్యూ అవ్వాలని ఆమె తెలిపారు. ఇప్పటివరకు ఇండియాలో  27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని,ఇవాళ చేసిన ప్రకటనతో ఇకపై దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు. కాంగ్రెస్ చేసిన విమర్శలపై తాను కామెంట్ చేయడం లేదని సీతారామన్ అన్నారు. ఎందుకంటే బ్యాంకు మోసాలు భారత పౌరుడికి ఊహగా మారితే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అని ఆమె అన్నారు. లక్షల కోట్ల రూపాయలు భారతీయ బ్యాంకులకు ఎగ్గొట్టి ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న వారిలో చాలామంది కాంగ్రెస్ హయాంలో  బాగా ఎంకరేజ్ చేయబడ్డారని ఆమె అన్నారు. 

బ్యాంకింగ్ రంగాన్ని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు. పనిచేసే విధానాన్ని బ్యాంకులు మార్చుకోవాలన్నారు. రికార్డు స్థాయిలో అప్పులు తిరిగి వసూలు చేశామన్నారు. రుణాల మసూళ్లపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ 59 నిమిషాల్లో రుణం వస్తుందన్నారు. 8 బ్యాంకులు రెపో రేటుకి అనుసంధానంగా రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. మొండిబకాయిలు గణనీయంగా తగ్గాయన్నారు.