Flipkart – Amazon: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో ఎలక్ట్రానిక్స్ పరికరాలపై “బంపర్ సేల్” ప్రారంభం

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరో మెగా సేల్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్టాక్ క్లియరెన్స్ కోసం సంస్థలు పోటీపడి మరీ డిస్కౌంట్ సేల్స్ ను ప్రారంభించాయి.

Flipkart – Amazon: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో ఎలక్ట్రానిక్స్ పరికరాలపై “బంపర్ సేల్” ప్రారంభం

Sales

Flipkart – Amazon: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరో మెగా సేల్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మార్చి 31తో ఆర్ధిక సంవత్సరం ముగియనుండటంతో ఈలోగా స్టాక్ క్లియరెన్స్ కోసం సంస్థలు పోటీపడి మరీ డిస్కౌంట్ సేల్స్ ను ప్రారంభించాయి. అమెజాన్ సంస్థ శుక్రవారం నుంచి “ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్” సేల్ పేరుతో భారీ డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించగా, ఫ్లిప్‌కార్ట్ సంస్థ “బిగ్ సేవింగ్ డేస్” పేరుతో శనివారం నుంచి డిస్కౌంట్ సేల్ ప్రారంభించింది.

Also read:Car Manufacturing: కొనసాగుతున్న చిప్ ల కొరత: కార్ల సంస్థలపై తీవ్ర ప్రభావం

అమెజాన్ లో మార్చి 11 నుంచి మార్చి 14 వరకు జరుగుతున్న “ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్” సేల్ లో స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఇతర గృహోపకరణాలు డిస్కౌంట్ సేల్ లో లభిస్తున్నాయి. రెడ్మి, శాంసంగ్, టెక్నో వంటి ఫోన్ లతోపాటుగా బ్రాండెడ్ టీవీలపైనా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ డిస్కౌంట్ తో పాటుగా..హెచ్.డీ.ఎఫ్.సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల కార్డులపై పది శాతం అదనంగా డిస్కౌంట్ అందిస్తుంది అమెజాన్. వీటితో పాటు అదనంగా ఫోన్ ఎక్స్చేంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా అమెజాన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Also read: SBI FD Interest Rates : SBI FD వడ్డీ రేట్లు పెరిగాయి.. కొత్త రేట్లు ఇవే..!

ఇక ఫ్లిప్‌కార్ట్ లోనూ భారీ డిస్కౌంట్ సేల్ శనివారం నుంచి ప్రారంభమైంది. “బిగ్ సేవింగ్ డేస్” సేల్ లో భాగంగా మొబైల్స్, టీవీలు సహా ఇతర ఉత్పత్తులు సైతం డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. మార్చి 12 నుంచి మార్చి 16 వరకు ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సేల్ లో భాగంగా సాధారణ డిస్కౌంట్ తో పాటు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అయితే ఈ సేల్ పరిమిత ఉత్పత్తులపైనా స్టాక్ ఉన్నంతవరకే చెల్లుతుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.