బడ్జెట్ 2020 : పాన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 10:07 AM IST
బడ్జెట్ 2020 : పాన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020(budget 2020) ప్రవేశపెట్టారు. పాన్ కార్డు(pan card) విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్ కార్డు లేని వారు తమ ఆధార్ కార్డు(aadhaar card) చూపిస్తే.. వెంటనే పాన్ కార్డు మంజూరు చేస్తారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ(income tax department) కొత్త వ్యవస్థను తీసుకురానుంది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి అప్లికేషన్ ఫిల్ చేయకుండానే.. ఆధార్ కార్డు చూపిస్తే.. పాన్ కార్డు మంజూరు చేస్తారు. ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇచ్చారు.

ట్యాక్స్ పేయర్ల(tax payers) కోసం ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తీసుకురానున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం త్వరలోనే కొత్త విధానం తీసుకొస్తామన్నారు. ఎలాంటి అప్లికేషన్ నింపాల్సిన పని ఉండదు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. పాన్ కార్డు మంజూరు చేస్తారు. ”చాలా ఈజీగా పాన్ కార్డు మంజూరు కోసం కొత్త సిస్టమ్ తీసుకురానున్నాం. దీని ప్రకారం ఆధార్ ఆధారంగా ఆన్ లైన్ లో పాన్ కార్డు మంజూరు అవుతుంది. ఎలాంటి అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదు” అని సీతారామన్ ప్రకటించారు.

పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ కట్టే సమయంలో పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఏదైనా సమర్పించొచ్చు. 2019లో ఈ విధానం తీసుకొచ్చారు. ఇక ఆధార్ తో పాన్ అనుసంధానం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీనికి 2020 మార్చి 31 డెడ్ లైన్. ఆధార్ తో పాన్ అనుసంధానం చేయకపోతే.. పాన్ కార్డు చెల్లకుండా పోతుంది. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఐటీఆర్(ITR) ఫైల్ చేయడానికి, బ్యాంక్ ఖాతా కోసం, ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే విషయం తెలిసిందే.

కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్ సృష్టించారు. సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేశారు. గత బడ్జెట్ ప్రసంగం 2 గంటల..17 నిమిషాలు కొనసాగగా.. ఈ సంవత్సరం..2 గంటల 41 నిమిషాల పాటు ప్రసంగాన్ని కొనసాగించి రికార్డు క్రియేట్ చేశారు. ప్రసంగం సమయంలో శ్వాస తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు. బడ్జెట్ సుదీర్ఘంగా ఉండటం.. దానికి తోడు అనారోగ్యం.. దీంతో నిర్మలా సీతారామన్.. ఇంకా రెండు పేజీలు ఉండగానే బడ్జెట్ ప్రసంగాన్ని ఆపివేయాల్సి వచ్చింది.

Also Read : బడ్జెట్ 2020 : రూ.5 లక్షలలోపు నో టాక్స్. రూ.7.5లక్షల వరకు 10% శాతం టాక్స్. షరతుల వర్తిస్తాయి.