గోఎయిర్ వీక్లీ సర్వీస్ : కన్నూరు టూ మస్కట్.. డైరెక్ట్ ఫ్లైట్

ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ త్వరలో వీక్లీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించనుంది. బడ్జెట్ విమానాల సర్వీసుల్లో ఇకపై వారానికి మూడు డైరెక్ట్ విమానాలను నడుపనుంది.

  • Published By: sreehari ,Published On : January 19, 2019 / 10:16 AM IST
గోఎయిర్ వీక్లీ సర్వీస్ : కన్నూరు టూ మస్కట్.. డైరెక్ట్ ఫ్లైట్

ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ త్వరలో వీక్లీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించనుంది. బడ్జెట్ విమానాల సర్వీసుల్లో ఇకపై వారానికి మూడు డైరెక్ట్ విమానాలను నడుపనుంది.

ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ త్వరలో వీక్లీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించనుంది. బడ్జెట్ విమానాల సర్వీసుల్లో ఇకపై వారానికి మూడు డైరెక్ట్ విమానాలను నడుపనుంది. కేరళలోని కన్నూర్ నుంచి మస్కట్ కు  డైరెక్ట్ గా విమాన సర్వీసులను నడుపనుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డైరెక్ట్ ఫ్లైట్ విమానం ప్రారంభ ధర రూ. 4,999గా గోఎయిర్ పేర్కొంది.

ఇప్పటికే టికెట్ బుకింగ్ స్టార్ట్ అయినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘గోఎయిర్ విమాన సర్వీసుల్లో మస్కట్ మూడో అంతర్జాతీయ మార్గం. మస్కట్ లో గోఎయిర్ కు మంచి మార్కెట్ ఉంది. డైరెక్ట్ విమాన సర్వీసులతో గోఎయిర్ మార్కెట్ ను మరింత విస్తృతపరిచేందుకు సహాయపడుతుందని భావిస్తున్నాం’’ అని గోఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ జెహ్ వాడియా ఆశాభావం వ్యక్తం చేశారు.