అక్షయ తృతీయ : మూడేళ్ల తర్వాత పెరిగిన బంగారం విక్రయాలు, ఆనందంలో వ్యాపారులు

అక్షయ తృతీయ రోజున బంగారం షాపుల యజమానులు పండగ చేసుకున్నారు. అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగాయి. 2018తో పోలిస్తే

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 04:16 AM IST
అక్షయ తృతీయ : మూడేళ్ల తర్వాత పెరిగిన బంగారం విక్రయాలు, ఆనందంలో వ్యాపారులు

అక్షయ తృతీయ రోజున బంగారం షాపుల యజమానులు పండగ చేసుకున్నారు. అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగాయి. 2018తో పోలిస్తే

అక్షయ తృతీయ రోజున బంగారం షాపుల యజమానులు పండగ చేసుకున్నారు. అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగాయి. 2018తో పోలిస్తే అమ్మకాలు 25శాతం పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు తక్కువలోనే ఉండడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడం బంగారం విక్రయాలు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు. 2018 అక్షయ  తృతీయ రోజుతో పోలిస్తే బంగారం రిటైల్‌ ధరలు తులానికి 7 శాతం తక్కువగా రూ.32వేల స్థాయిలో ఉన్నాయి. ఇది కూడా విక్రయాలు పెరిగేందుకు కారణం. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత.. అమ్మకాలు అంత ఆశాజనకంగా లేవని వ్యాపారులు వాపోయారు. మూడేళ్లు నిరాశే ఎదురైందన్నారు. ఈసారి మాత్రం విక్రయాలు బాగానే జరిగాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం అమ్మకాల్లో ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాది ముందుంది.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోళ్లను భారతీయులు శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు గోల్డ్ కొంటే లాభం జరుగుతుందని నమ్ముతారు. చిన్న మొత్తంలోనైనా గోల్డ్ కొంటారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి అమ్మకాలు బాగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు అందుబాటులో ఉండటం కూడా ఈసారి అమ్మకాల పెరుగుదలకు దోహదపడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం (మే 7,2019) బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.32వేల670 వద్ద ముగిసినా.. డిస్కౌంట్లతో రిటైల్ మార్కెట్ ధరల శ్రేణి రూ.31,800-32,000 మధ్యే ఉండటం కూడా కస్టమర్లను కొనుగోళ్లకు ఆకర్షించిందని వ్యాపారులు చెప్పారు.