కొనడం కష్టమేనా : బంగారం ధర ఎంతో తెలుసా

  • Published By: madhu ,Published On : January 6, 2020 / 12:57 PM IST
కొనడం కష్టమేనా : బంగారం ధర ఎంతో తెలుసా

పసిడి ప్రియులకు ఇది నిజంగా చేదు వార్త. బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న వారి ప్లాన్లను మరికొన్ని రోజులు పెండింగ్‌లో పెట్టాల్సిందే. ఎందుకంటే ఆకాశాన్ని అంటున్న ధరలను చూసి షాక్ తింటున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు అధికమౌతునే ఉన్నాయి. వెండి కూడా తన దారి కూడా అదేనంటోంది. పండుగ సీజన్‌ కావడంతో బంగారం కొనుక్కోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికంతటికి కారణం పశ్చిమాసియాలోతీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడమే. 

దేశీయ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. రెండో రోజు ధరలు పెరిగాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 41 వేయికి చేరుకుంది. ఏకంగా రూ. 1800 పెరగడం గమనార్హం. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొనడమే దీనికి కారణమంటున్నారు వ్యాపార నిపుణులు. అమెరికా – ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం క్రమంలో బంగారంలో పెట్టబడులే బెటర్ అని ముదుపర్లు భావించడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. 

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం, కేంద్ర బ్యాంకుల నుంచి కొనుగోలు, బంగారంపై పెట్టుబడి డిమాండ్ పెరగడం వంటివి బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. భారతదేశంలో ప్రభుత్వం బంగారంపై విధించే దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ఇండియాలో బంగారం ధరలు 12.5శాతం ​​దిగుమతి సుంకంతో పాటు 3శాతం జీఎస్టీ కూడా ఉంది.

గ్రాము 24 క్యారెట్ గోల్డ్
1 గ్రాము రూ. 4, 070
8 గ్రాములు రూ. 32, 560
10 గ్రాములు రూ. 40, 700
100 గ్రాములు రూ. 4, 07, 000
నగరం 22 క్యారెట్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్
చెన్నై రూ. 38, 960 రూ. 42, 510
ముంబై రూ. 39, 700 రూ. 40, 700
ఢిల్లీ రూ. 39, 800 రూ. 41, 000
కోల్ కతా రూ. 39, 950 రూ. 41, 350
బెంగళూరు రూ. 38, 300 రూ. 42, 510
హైదరాబాద్ రూ. 38, 960 రూ. 42, 510
విజయవాడ రూ. 38, 960 రూ. 42, 510
విశాఖపట్టణం రూ. 38, 960 రూ. 42, 510