Today Gold Price: దిగివచ్చిన పసిడి.. నేడు ధరల వివరాలివే!

గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. మంగళవారం కూడా స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలలో రోజువారీ మార్పులు సహజమే కాగా నేడు పలుచోట్ల స్వల్పంగా పెరిగింది. అయితే.. ఇది ఆల్ టైం ధరలతో పోలిస్తే తగ్గినట్లే. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రూ.40 పెరిగిన పసిడి చెన్నైలో తులం బంగారంపై రూ.130 తగ్గింది.

Today Gold Price: దిగివచ్చిన పసిడి.. నేడు ధరల వివరాలివే!

Today Gold Price

Today Gold Price: గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. మంగళవారం కూడా స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలలో రోజువారీ మార్పులు సహజమే కాగా నేడు పలుచోట్ల స్వల్పంగా పెరిగింది. అయితే.. ఇది ఆల్ టైం ధరలతో పోలిస్తే తగ్గినట్లే. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రూ.40 పెరిగిన పసిడి చెన్నైలో తులం బంగారంపై రూ.130 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల్లో నేటి ఉదయానికి స్థిరంగా ఉంటూ నిన్నటితో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పు లేకపోగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ. 120 పెరిగింది.

ఇక, హైదరాబాద్‌లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర మంగళవారం ఉదయానికి.. బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు 1 గ్రాము రూ.4,431గా ఉండగా 8 గ్రాములు రూ.35,448 గా ఉంది. 10 గ్రాములు ధర రూ.44,310గా ఉంది. పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,834గా ఉండగా 10 గ్రాముల బంగారం ధర రూ. 48,340 ఉంది. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌ నగరాలలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి.

బంగారం ధరలు తగ్గడానికి, పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్న బులియన్‌ మార్కెట్‌ నిపుణులు బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తుండగా ప్రస్తుతం మార్కెట్ పసిడి ధరలను పోలిస్తే ఇది ఆల్ టైం ధరలకు తక్కువనే చెప్పుకోవాలి.