Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. బంగారం ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Price Today Gold Prices Drop From Marginally Today

Gold Price Today: కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. బంగారం ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం (జూన్ 16)న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత 10 రోజుల్లో బంగారం ధర 6 సార్లు పెరిగింది.. మూడు సార్లు తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.160 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.45,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 47,640 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,790గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,590 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,590 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరల్లో మార్పు, కరోనా, ద్రవ్యోల్బణం, బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,760 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,920 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500గా ఉంది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630 వద్ద ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630 వద్ద కొనసాగుతోంది.