Gold : బంగారం కొనాలని అనుకుంటున్నారా ? అయితే..ఇంకెందుకు ఆలస్యం

బంగారం ధర తగ్గడం లేదని..కొనుక్కోకుండా ఉన్న వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే...భారీగా బంగారం ధర తగ్గిపోయింది. ఒక్కరోజులోనే...రూ. 400కి తగ్గింది.

Gold : బంగారం కొనాలని అనుకుంటున్నారా ? అయితే..ఇంకెందుకు ఆలస్యం

Gold

Gold Price Today : బంగారం అంటే అందరికీ ముద్దే. ఎప్పుడు బంగారం ధర తగ్గుతుందా ? ఎప్పుడు కొనుక్కోవాలా అని ఎదురు చూస్తుంటారు. ఎక్కువగా మహిళలు. ధర తగ్గడం లేదని..కొనుక్కోకుండా ఉన్న వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే…భారీగా బంగారం ధర తగ్గిపోయింది. ఒక్కరోజులోనే…రూ. 400కి తగ్గింది. మల్టీ కమోడిటీ  ఎక్స్చేంజ్ (MCX)లో బంగార ధర సెప్టెంబర్ 23వ తేదీ గురువారం రోజున 0.62 శాతం క్షీణించి..రూ. 46 వేల 383కు చేరింది.

Read More : Registrations : ఇక సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

అయితే ధరలు భారీగా పడిపోవడానికి కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో యూఎస్ ఫెడ్ ఊహించిన దానికంటే…వడ్డీ రేటును ప్రకటించడం, తన నెలవారీ బాండ్ కొనుగోళ్లను సడలించినట్లు పేర్కొన్న తర్వాత…భారతదేశంలో భారీగా బంగార ధర పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 400 తగ్గడంతో రూ. 46 వేల 468కి చేరింది. 22 క్యారెట్ల బంగారం  ధర రూ. 42 వేల 934 నుంచి రూ. 42 వేల 565కి చేరుకుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ. 47 వేల 840 నుంచి రూ. 47 వేల 560కి చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే…బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి రూ. 600 తగ్గింది. ప్రస్తుతం రూ. 60 వేల 362గా ఉంది.