బంగారం ధర తగ్గుతుందా.. పెరుగుతుందా.. ఎప్పుడు కొనాలి

బంగారం ధర తగ్గుతుందా.. పెరుగుతుందా.. ఎప్పుడు కొనాలి

Gold Rates: బంగారం ధర తగ్గింది.. ఆభరణాలు ఇప్పుడు కొనుక్కోవాలా.. మరికొద్ది సమయం వెయిట్ చేస్తే ఇంకా తగ్గుతుందా.. అమ్మో ఇంకా పెరిగిపోతే ఎలా అనే సందేహంలో ఉన్నారా.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో భారీగా పతనమవుతోన్న డాలర్లలో పతనమవుతోంది. ఫిబ్రవరి 5వ తేదీ శుక్రవారం నాటికి 1,815 డాలర్ల వద్ద ముగియగా న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌ (నైమెక్స్‌)లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా)గా నమోదైంది. గత వారంతో పోలిస్తే అది 70డాలర్లు తక్కువే.

అమెరికా సహా వరల్డ్ ఎకానమీ రికవరీ ధోరణి వంటి అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వడ్డీరేట్లు పెరిగితే పసిడికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వడ్డీరేట్ల పెరుగుదల డాలర్‌ బలోపేతం కావడానికి దారితీస్తుంది. అలా జరిగినా పసిడిపై ప్రతికూల ప్రభావమే కనిపిస్తుంది. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,458 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,089 డాలర్లు. ఇక డాలర్‌ ఇండెక్స్‌ 52 వారాల కనిష్ట, గరిష్టాలు 89.16 –104 శ్రేణిలో ఉంది.

జస్ట్ 5 రోజుల్లో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,910 మాత్రమే తగ్గింది. ఆ తర్వాత 2 రోజుల్లో రూ.340 పెరిగింది. అందువల్ల ఇకపైనా మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఫిబ్రవరి 8 బంగారం ధరలు : నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44వేల 60గా ఉంది. ఒక్కరోజు వ్యత్యాసంలో రూ.10 మాత్రమే పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,406 ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48వేల 70గా ఉంది. తులం బంగారం కావాలంటే దాని ధర రూ.38,456 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,807 ఉంది.

ఫిబ్రవరి 8 వెండి ధరలు: వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73వేల 400గా ఉంది. గతేడాది ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి 76వేల 510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ కనిష్టంగా కేజీ రూ.57వేల ధరను చవిచూసింది. ఆ తర్వాత నుంచి అటూఇటుగా స్కేల్ అవుతూ.. ఇంకా ఎక్కువగానే ఉంటుంది.