Gold Prices : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెరిగితే భారీగా పెరగడం తగ్గితే భారీగా తగ్గడం పసిడి ట్రెండ్ గా మారిపోయింది. గత వారం తరుగుదల నమోదు చేసిన బంగారం మళ్లీ నాలుగు రోజులుగా పెరుగుదల నమోదు చేస్తోంది.

Gold prices : బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెరిగితే భారీగా పెరగడం తగ్గితే భారీగా తగ్గడం పసిడి ట్రెండ్ గా మారిపోయింది. గత వారం తరుగుదల నమోదు చేసిన బంగారం మళ్లీ నాలుగు రోజులుగా పెరుగుదల నమోదు చేస్తోంది. నిన్న ఢిల్లీ మార్కెట్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.970 పెరిగి 56,550కి చేరింది. వెండి ధర కూడా కేజీకి 1600 మేర పెరిగి రూ.63,820కి చేరింది.

అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ ధర 1375 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి 20.75 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం కనిపిస్తోంది. అమెరికా డాలర్ విలువ పతనం అవ్వడం ద్రవ్యోల్బణం కట్టడికి ఓవైపు ఫెడ్రిట్ల పెంపు చేయబోతున్నారు.

Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు

అలాగే యూఎస్ అకాడమిక్ డేటా పాజిటివ్ గా రావడం, మరోవైపు అమెరికాలో రెండు బ్యాంకులు దివాళా తీయడం వంటి పరిణామాలు మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలించడం వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడిందని దీంతో ఐదు వారాల గరిష్టానికి బంగారం ధర చేరిందని నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు