చరిత్ర సృష్టించావా తల్లీ : బంగారం రూ.40 వేలు

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 01:07 PM IST
చరిత్ర సృష్టించావా తల్లీ : బంగారం రూ.40 వేలు

బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఊహించని విధంగా గోల్డ్ ధరలు పెరిగాయి. సోమవారం(ఆగస్టు 26,2019) పసిడి ధరలు పాత రికార్డులను చెరిపేశాయి. ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40వేలని క్రాస్ చేసింది. స్పాట్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40వేల 260గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.40వేల 240గా నమోదైంది. ముంబైలో రూ.39వేల 851గా ఉంది. విజయవాడ, విశాఖలో రూ.39వేల 850గా ఉంది. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.36వేల 800 దగ్గర ట్రేడ్ అయ్యింది. వెండి ధరలు విషయానికి వస్తే కిలో వెండి ధర రూ.45వేలుగా ఉంది. 5 రోజుల క్రితం గోల్డ్ రేట్ రూ.38వేల 885గా ఉంది. పదేళ్ల క్రితం 10గ్రాముల బంగారం ధర రూ.14వేలు మాత్రమే ఉండేది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా-చైనా ట్రేడ్ వార్ కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణం. దేశంలో శుభకార్యాలు, పండగ సీజన్లు కావడం.. రూపాయి బలహీనపడి డాలర్(రూ.72) బలపడటం కూడా గోల్డ్ రష్ కి కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, దేశీయంగా ఉన్న ఆటోమొబైల్ రంగం షేర్లు లాస్ లో ఉండటం కూడా పుత్తడి రేట్లు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ గా గోల్డ్, సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

జెట్ స్పీడ్ తో పెరిగిపోతున్న బంగారం ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక జీవితంలో గోల్డ్ కొనగలమా అని సందేహిస్తున్నారు. కాగా, గోల్డ్ ధరలు త్వరలో రూ.41వేలు తాకొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. దీపావళి నాటికి రూ.42వేల మార్కుని తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని బాంబు పేల్చారు. దీంతో జనాలు మరింత టెన్షన్ పడుతున్నారు.

Also Read : రూ.10వేల లోపు : Redmi Note 8 సిరీస్ వచ్చేస్తోంది