మరోసారి దిగొచ్చిన గోల్డ్.. కొంటున్నారా!!

మరోసారి దిగొచ్చిన గోల్డ్.. కొంటున్నారా!!

Gold prices today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం ధర మరోసారి పడిపోయింది. గోల్డ్ కొనుక్కోవాలని చూసేవారికి ఇది లక్కీ ఛాన్స్. ఇక అదే దారిలో వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో రేటు రూ.45వేల 220కు క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 క్షీణతతో రూ.41వేల 450కు దిగొచ్చింది.

బంగారం ధర పడిపోతుంటే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.500 పతనమైంది. దీంతో రేటు రూ.69వేల 900కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా మారింది.

మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధర కిందకు కదిలింది. గోల్డ్ ఔన్స్‌కు 0.16 శాతం తగ్గడంతో 1698 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.71 శాతం తగ్గుదలతో 25.28 డాలర్లకు పడిపోయింది.

బంగారం ధర మార్పుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ గోల్డ్ రేట్లలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యూయలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, కమర్షియల్ వార్స్, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.