మరోసారి మిన్నంటనున్న బంగారం ధరలు.. రూ.65వేల వరకూ!!

GOLD RATE: మరోసారి గోల్డ్ రేట్ పీక్స్‌లోకి చేరనుందా.. లాక్‌డౌన్ తర్వాత దాదాపు రూ.60వేల వరకూ చేరేలా కనిపించిన గోల్డ్ ఈ సారి 10 గ్రాములు ధర రూ.65వేలకు చేరుతుంది. వరల్డ్ వైడ్‌గా గతేడాది ఫైనాన్షియల్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా మహమ్మారి భయాలు పెట్టుబడిదారులను ఉక్కిరి బిక్కిరి చేయగా, పెట్టుబడులన్నీ బంగారం వైపుకు మళ్లాయి.

బంగారాన్ని పెట్టుబడులకు సురక్షితంగా భావిస్తుండటమే కారణంగా మారింది. పసిడి ధరలు ఒక్కసారిగా ఊపందుకోవడంతో దేశీయ మార్కెట్‌లో ఏకంగా 2020లో 10 గ్రాముల పుత్తడి మునుపెన్నడూ లేనివిధంగా రూ.57వేలకు పైగా చేరింది. 2019 ముగింపు ధరతో పోల్చితే 44 శాతం ఎగబాకింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒకానొక దశలో ఔన్సు గోల్డ్‌ 2వేల 75 డాలర్లకు చేరింది.

ఇదే దూకుడు 2021లోనూ కొనసాగవచ్చని నిపుణులు చెప్తున్నారు. పసిడి ధర రూ.65వేల మార్కును చేరుకోవచ్చని అంటున్నారు. నిజానికి కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ దాదాపు సిద్ధం కావడంతో స్టాక్‌ మార్కెట్లు పెరిగి.. గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సిన్‌ ప్రభావాన్నిబట్టి మరింతగా దిగిరావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ధరలు పెరిగే వీలుందన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తుండటం గమనార్హం.

బంగారం పట్ల మదుపరుల అభిప్రాయంలో 2020లో తేడా వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏటా స్టాక్‌ మార్కెట్లు పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గటమో లేదా స్థిరంగా ఉండటమో జరుగుతుంది. దీనికి కారణం బంగారంపై పెట్టుబడులు తాత్కాలికం కావడమే.

స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ఉంటే మదుపరులు తమ పెట్టుబడులను ప్రత్యామ్నాయ మార్గంగా పసిడి వైపు మరలిస్తుంటారు. అందువల్లే మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడులు తగ్గి ధరలు తగ్గుముఖం పడుతాయి. గతేడాది మాత్రం అలా జరగలేదు. స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడులు పెరిగి ధరలు పరుగులు పెట్టాయి. స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నప్పుడు బంగారంపై పెట్టుబడులు తగ్గినా మునుపటి స్థాయిలో దిగలేదు.

2020లో స్టాక్‌ మార్కెట్లు, బంగారం ధరలు రికార్డుల్లో నిలిచాయి. ఏడాది చివర్లో బంగారం ధర రూ.50వేల దరిదాపుల్లో నిలిచింది. 2019 ముగింపు ధరతో పోల్చితే దాదాపు 25 శాతం అధికమే.

ట్రెండింగ్ వార్తలు