Gold Rate : బంగారం కొనే వారికి భారీ షాక్!

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో బంగారంపై రూ.1500 వరకు పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Gold Rate : బంగారం కొనే వారికి భారీ షాక్!

Gold Rate

Gold Rate : పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.. కొత్తగా బంగారం కొనాలి అనుకునే వారికి ఇది చేదువార్తే అని చెప్పక తప్పదు. ఆషాడ మాసంలో క్రమంగా తగ్గిన బంగారం ధరలు.. శ్రావణ మాసంలో పుంజుకున్నాయి. గత 15 రోజుల నుంచి బంగారం ధర పెరుగుతూనే వస్తుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు బులియన్ నిపుణులు..ఒకటి కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. రెండవది అఫ్ఘానిస్టన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం. ఈ రెండు పరిణామాల వలన పెట్టుబడి పెట్టాలనుకునేవారు అధికంగా బంగారం వైపు చూస్తున్నారట.. దీంతో బంగారం రేట్లకు రెక్కలు వచ్చాయని చెబుతున్నారు.

మరోవైపు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదికూడా బంగారం ధర పెరుగుదలకు ఓ కారణం అని అంటున్నారు నిపుణులు. ఇక దేశంలో మంగళవారం నమోదైన ధరలను ఓసారి పరిశీలిస్తే.. భారత మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,646గా ఉంది. సోమవారంతో పోల్చితే మంగళవారం పసిడిపై రూ.350 పెరిగింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,644గా ఉంది.

రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఈ ధరలో మార్పులు ఉంటాయి. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి ₹48,490కు చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ₹44,450గా ఉంది. విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.800 పెరిగి రూ.63,030 చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.