దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు అదే దారిలో..

  • Published By: sreehari ,Published On : September 17, 2020 / 08:11 PM IST
దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు అదే దారిలో..

బంగారం దిగొచ్చింది.. మొన్నటిదాకా కొండెక్కిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి.. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ బలహీనపడటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఇక MCX ఫ్యూచర్‌లో 10గ్రాముల బంగారం ధర 0.80 శాతంతో రూ. 415 తగ్గి రూ. 51,409 పలుకుతోంది. ఇక కిలో వెండి 1.34 శాతానికి రూ. 919 మేర పతనమై రూ. 67,802 ధరతో నిలిచింది.



మరోవైపు రూపాయి బలహీనపడటంతో దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.137 తగ్గి రూ.53,030 వద్ద పతనమైంది. కిలో వెండి కూడా రూ.517 మేర తగ్గి రూ.70,553 ధర పలుకుతోంది. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను సున్నా స్ధాయిలో కొనసాగిస్తామని స్పష్టం చేసిన తర్వాత దేశీయ బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.



డాలర్‌ స్ధిరంగా ఉండటంతో బంగారంపై ముదుపుదార్ల నుంచి డిమాండ్‌ తగ్గింది. ఫెడ్‌ నిర్ణయాలు మిశ్రమంగా ఉన్నా బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో బంగారం పతనానికి దారితీసింది.