బిగ్ షాక్ : రూ.42వేలకి చేరనున్న బంగారం ధర

ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 07:35 AM IST
బిగ్ షాక్ : రూ.42వేలకి చేరనున్న బంగారం ధర

ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి

ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమవడం, స్టాక్ మార్కెట్లు అంతంత స్థాయిలో రిటర్నులు పంచడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతో .. ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. వీటికి తోడు పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొనడం, సెంట్రల్ బ్యాంకులు అత్యధికంగా కొనుగోళ్లు జరుపడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడటంతో బంగారం మరింత మిలమిలమెరువబోతున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రూ.40 వేల స్థాయిలో కదలాడుతున్న పసిడి ధరలు ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ నాటికి రూ.42 వేల మార్క్‌కు చేరుకోనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మధ్య తూర్పు దేశాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ ధర 1,650 డాలర్లకు, అలాగే ఎంసీఎక్స్‌లో రూ.42 వేలకు చేరుకోనుందంటున్నారు.

గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలతో సామాన్యుడికి అందనంత దూరంలోకి పసిడి చేరుకుంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల ధర రూ.39,840 స్థాయిలో కదలాడుతుంది. ఈక్విటీ మార్కెట్ల కంటే బంగారం, భూములపై పెట్టుబడులు పెట్టిన వారికి రిటర్నులు అధికంగా లభిస్తుండటంతో గతేడాది కాలంగా వీటివైపు మొగ్గుచూపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని, అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు లేకపోవడం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలకు ఆర్థిక మాంద్యం దెబ్బ తగలనుందన్న సంకేతాలతో పలు సెంట్రల్ బ్యాంకులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా కొనుగోళ్లు జరుపడంతో రికార్డు స్థాయికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.  

అటు దసరా, దీపావళి పండుగ వ్యాపారుల్లో వెలుగులను నింపలేకపోయింది. ఈసారి అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని తాజాగా విడుదలైన వరల్డ్‌ లైన్ నివేదిక చెబుతోంది. పండుగ అంటేనే.. ఆభరణాలు, దుస్తులు. అయితే ఈ రెండింటి విక్రయాలు ఈ సీజన్‌లో చాలా తక్కువగా జరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరుగాలని చేస్తున్న ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపట్లేదని తేలిపోయింది.