Gold : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర

బంగారం, వెండి కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. విలువైన ఈ లోహాల ధరలు తగ్గాయి.

Gold : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర

Gold Silver Price Today

Gold : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.

కాగా, బంగారం, వెండి కొనాలనుకొనే వారికి ఇది శుభవార్తే. విలువైన ఈ లోహాల ధరలు దిగొచ్చాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.810లు తగ్గింది. దీంతో ఢిల్లీలో బంగారం ధర రూ.46,896గా ఉంది. క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.47,706గా ఉంది.

మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1,548లు తగ్గడంతో క్రితం ట్రేడింగ్‌లో రూ.64,268లుగా ఉన్న ధర ప్రస్తుతం రూ.62,720కి దిగొచ్చింది.

Beware Of Children : టీవి, సెల్ ఫోన్లతో గడిపే చిన్నారులతో జాగ్రత్త!….ఎందుకంటే

అంతర్జాతీయ మార్కెట్ లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో రూపాయి క్షీణత ఉన్నప్పటికీ ఢిల్లీలో రాత్రికి రాత్రి పసిడి ధర రూ.810 తగ్గినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్ అనలిస్ట్ (కమోడటీస్‌) తపన్‌ పటేల్‌ విశ్లేషించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1806 అమెరికా డాలర్లుగా ట్రేడ్‌ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.05 డాలర్లుగా ఉంది.

ఇదిలా ఉండగా.. తాజా తగ్గుదలతో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర దాదాపు రూ.49,250లుగా ఉంది. నిన్నటి ట్రేడింగ్‌లో హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 గా ట్రేడ్‌ కాగా.. విజయవాడలో రూ.50,450.. విశాఖలో 49,510లుగా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఇది కేవలం ధరించే ఆభరణమే కాదు సురక్షితమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. అందుకే, పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలామంది ఇష్టపడతారు. గోల్డ్ విలువ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. ఇక భారతీయులకు అత్యంత ప్రీతికరమైంది గోల్డ్. మహిళలు పసిడికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.

SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఆ నెంబర్లతో జాగ్రత్త!

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం రేట్లపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు.